ఒకప్పుడు ముద్దు ముద్దు మాటలతో అలరించిన ఈ అందాల యాంకరమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

యాంకరింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది జయంతి. పేరు చెబితే చాలామందికి గుర్తుకురాకపోవచ్చు కానీ గతంలో జెమినీ మ్యూజిక్ ఛానెల్‌లో టెలికాస్ట్‌ అయిన 'వెన్నెల' ప్రోగ్రాం యాంకర్‌ అంటే ఇట్టే గుర్తుకు వస్తుందామె. జెమినీ మ్యూజిక్ ఛానెల్‌ ఆదిత్య టీవీ గా మారాక అందులో రాత్రి 10 గంటలకు 'వెన్నెల షో' ప్రారంభమయ్యేది.

ఒకప్పుడు ముద్దు ముద్దు మాటలతో అలరించిన ఈ అందాల యాంకరమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో తెలుసా?
Anchor Jayathi
Follow us
Basha Shek

|

Updated on: Jun 08, 2023 | 6:10 AM

టాలీవుడ్‌ బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన స్టార్‌ యాంకర్లు చాలామందే ఉన్నారు. సుమ, ఝాన్సీ, రష్మీ, అనసూయ, శ్రీముఖి, లాస్య, రవి, ప్రదీప్.. ఇలా చాలామంది యాంకరింగ్‌లో తమదైన ముద్ర వేసుకున్నారు. తమ ముద్దు ముద్దు మాటలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. అయితే వీరిలా కాకపోయినా ఉన్నంతలో యాంకరింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది జయంతి. పేరు చెబితే చాలామందికి గుర్తుకురాకపోవచ్చు కానీ గతంలో జెమినీ మ్యూజిక్ ఛానెల్‌లో టెలికాస్ట్‌ అయిన ‘వెన్నెల’ ప్రోగ్రాం యాంకర్‌ అంటే ఇట్టే గుర్తుకు వస్తుందామె. జెమినీ మ్యూజిక్ ఛానెల్‌ ఆదిత్య టీవీ గా మారాక అందులో రాత్రి 10 గంటలకు ‘వెన్నెల షో’ ప్రారంభమయ్యేది. ఈ షోకు దాదాపు 10 ఏళ్ల పాటు యాంకర్‌గా వ్యవహరించింది జయతి. తన ముద్దు ముద్దు మాటలతో, అందం అభినయంతో టీవీ ప్రేక్షకులను కట్టిపడేసింది.

అయితే వెన్నెల తర్వాత మరే షోలోనూ యాంకరింగ్ చేయలేదు జయతి. అదే సమయంలో వెండితెరపైకి అడుగుపెట్టింది. 2018లో లచ్చి అనే సినిమాలో హీరోయిన్‌గా నటించిందీ అందాల యాంకరమ్మ. అయితే సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మరోసారి బుల్లితెరపై కానీ, వెండితెరపై కానీ కనిపించలేదు జయంతి. అయితే ఇటీవల ఓ టీవీ షోలో సడెన్‌గా ప్రత్యక్షమైంది. ఇందులో ఓ పాటకు హుషారైన స్టెప్పులు వేసి ప్రేక్షకులను, అభిమానులను అలరించింది. దీంతో యాంకర్ జయతి పేరు మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆమె ఈషోకు గెస్ట్‌గా వచ్చిందా? లేకపోతే బుల్లితెరపై సెకెండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిందా అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

జయతి లేటెస్ట్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.