AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యజ్ఞం మూవీలో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా కనిపించిన ఈ నటి గుర్తుందా? డైరెక్టర్‌ను పెళ్లాడిన ఆమె ఇప్పుడెలా ఉందో తెలుసా?

మ్యాచో హీరో గోపిచంద్‌ కెరీర్‌ ప్రారంభంలో నటించిన చిత్రం యజ్ఞం. సమీరా బెనర్జీ హీరోయిన్‌గా నటించిన చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. గోపీచంద్ యాక్షన్‌ సీక్వెన్స్‌, సమీరా అందచందాలు, పాటలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఫ్రెండ్ పాత్రలో కనిపించి అందరినీ కడుపుబ్బా నవ్వించింది జాహ్నవి.

యజ్ఞం మూవీలో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా కనిపించిన ఈ నటి గుర్తుందా? డైరెక్టర్‌ను పెళ్లాడిన ఆమె ఇప్పుడెలా ఉందో తెలుసా?
Actress Jahnavi
Basha Shek
|

Updated on: Jun 09, 2023 | 6:20 AM

Share

మ్యాచో హీరో గోపిచంద్‌ కెరీర్‌ ప్రారంభంలో నటించిన చిత్రం యజ్ఞం. సమీరా బెనర్జీ హీరోయిన్‌గా నటించిన చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. గోపీచంద్ యాక్షన్‌ సీక్వెన్స్‌, సమీరా అందచందాలు, పాటలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఫ్రెండ్ పాత్రలో కనిపించి అందరినీ కడుపుబ్బా నవ్వించింది జాహ్నవి. తెలుగు, హిందీ భాషలు కలిపి మాట్లాడడం, హీరోయిన్‌ వాళ్ల ఇంట్లో మూగ అమ్మాయిగా నటించడం, ధర్మవరపు సుబ్రమణ్యంతో ఆట పట్టించే సన్నివేశాలు ప్రేక్షకులను తెగ నవ్వించేశాయి. ముఖ్యంగా జాహ్నవి నటన అందరినీ ఆకట్టుకుంది. ఈమె నటినే కాదు ఓ స్టార్‌ యాంకర్‌ కూడా.. జెమిని టీవిలో ప్రసారమైన డాన్స్ బేబీ డాన్స్ షో కి యాంకర్‌గా వ్యవహరించిందామె. తన అందంతో పాటు ముద్దుముద్దు మాటలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత వెండితెరకు పరిచయమైంది. యజ్ఞం సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్‌కు బాగా చేరువైంది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ సినిమాలో కూడా జెనీలియాకి స్నేహితురాలిగా యాక్ట్‌ చేసింది. ఎన్టీఆర్‌ అశోక్‌ సినిమాలో సమీరా రెడ్డి ఫ్రెండ్‌గానూ నటించి మెప్పించింది.

ఇలా యాంకర్‌గా, నటిగా మెప్పించిన జాహ్నవి పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. అన్నట్లు జాహ్నవి భర్త కూడా సినిమా రంగానికి చెందిన వారే. ఆయన మరెవరో కాదు పలు హిట్‌ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన రసూల్ ఎల్లోర్. గాయం, మనీ మనీ, గులాబీ, లిటిల్ సోల్జర్స్, జల్సా వంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు రసూల్ ఎల్లోర్. ఆ తర్వాత శ్రీరామ్, ఆర్తి చాబ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన ఒకరికి ఒకరు సినిమాతో మెగా ఫోన్‌ పట్టుకున్నారు. ఆ తర్వాత రవితేజ భగీరథ, సంగమం సినిమాలకు దర్శకత్వం వహించారు. గాయం, నువ్వు నేను సినిమాలకి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా నంది అవార్డును అందుకున్న రసూల్‌ ఎల్లోర్‌, ఒకరికి ఒకరు సినిమాకి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా కూడా నంది అవార్డుని అందుకున్నారు. కాగా 2019 లో అడవి శేష్, రెజీనా హీరో హీరోయిన్లుగా వచ్చిన ఎవరు సినిమాకి కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా వ్యవహరించారు జాహ్నవి. అయితే స్క్రీన్‌పై మాత్రం కనిపించలేదు. అయితే జాహ్నవికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టంట వైరల్‌గా మారాయి. అప్పట్లో స్లిమ్‌గా కనిపించిన ఆమె ఇప్పుడు మాత్రం కొద్దిగా లావుగా అయింది. అయితే అందంలో అప్పటికీ, ఇప్పటికీ ఏ మాత్రం తేడా లేదు.

ఇవి కూడా చదవండి
Actress Jahnavi 1

Actress Jahnavi

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్