Anchor Suma: అయ్యో యాంకర్ సుమకు ఏమైంది? ఏంటా గాయాలు? వైరలవుతోన్న ఫొటోస్
ఇటీవల తిరుపతి వేదికగా జరిగిన ప్రభాస్ ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ స్టార్ యాంకర్ కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీనిపై నెట్టింట చర్చ కూడా జరుగుతోంది. ఈక్రమంలో సుమ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కాళ్లకు గాయాలు కావడం, ప్లాస్టర్స్‌తో ఉండడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు.
తన మాటల ప్రవాహంతో టాలీవుడ్ బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది స్టార్ యాంకర్ సుమ కనకాల. పుట్టింది కేరళలో అయినా తెలుగులో గల గలా మాట్లాడడం ఈమెకు కోట్లాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది. టీవీ షో అయినా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా యాంకర్‌గా సుమ లేకుంటే ఆసక్తి ఉండదు అన్న పరిస్థితి ఉందంటే టాలీవుడ్‌లో సుమకు ఉన్న క్రేజ్‌ను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల తిరుపతి వేదికగా జరిగిన ప్రభాస్ ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ స్టార్ యాంకర్ కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీనిపై నెట్టింట చర్చ కూడా జరుగుతోంది. ఈక్రమంలో సుమ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కాళ్లకు గాయాలు కావడం, ప్లాస్టర్స్‌తో ఉండడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే ప్రస్తుతం ఫారిన్ వెకేషన్‌లో ఉన్న సుమ బాగా తిరగడం వల్ల తన కాలివేళ్లకు గాయాలు అయ్యాయని చెప్పుకొచ్చింది. షూస్ కొరికేయడంతో గాయాలు అయ్యి తీవ్రమైన బాధ కలిగిస్తున్నాయని ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది సుమ.
ఇదే సమయంలో ఆది పురుష్ ఈవెంట్‌ను మిస్ అయ్యానంటూ ఓ వీడియోను కూడా పంచుకుంది యాంకర్ సుమ కనకాల. ఈ సందర్భంగా ప్రభాస్ అండ్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పింది. కాగా ప్రస్తుతం ఫారిన్ ట్రిప్‌లో ఉంది సుమ. తన ఫ్యామిలీతో కలిసి ప్యారిస్, స్విట్జర్లాండ్ తదితర దేశాలను చుట్టేస్తూ బిజీబిజీగా ఉంటోంది. ఇదే క్రమంలో తన ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..