AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej- Lavanya: చూడముచ్చటైన జంట.. నా లవ్‌ దొరికిందంటూ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్‌ చేసిన వరుణ్‌, లావణ్య

తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు వరుణ్‌, లావణ్య. 'లవ్‌ దొరికిందంటూ' ఈ లవ్‌ బర్డ్స్‌ షేర్‌ చేసిన ఫొటోలు ఒక్కసారిగా వైరల్‌గామారాయి. కాబోయే పెళ్లి కూతురు లావణ్య కూడా ఇదే ఫోటోలను పోస్ట్ చేస్తూ 2016 నుంచే తమ ఇద్దరి ప్రేమ ఉన్నట్టు తెలిపింది.

Varun Tej- Lavanya: చూడముచ్చటైన జంట.. నా లవ్‌ దొరికిందంటూ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్‌ చేసిన వరుణ్‌, లావణ్య
Varun Tej, Lavanya Tripathi
Basha Shek
|

Updated on: Jun 10, 2023 | 5:55 AM

Share

మెగాస్టార్‌ ఇంట్లో ఎంగేజ్‌మెంట్‌ సందడి మొదలైంది. హీరో వరుణ్‌తేజ్‌ , లావణ్య త్రిపాఠిలకు వివాహ నిశ్చితార్థ కార్యక్రమం కొణిదెల నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వరుణ్‌, లావణ్య కుటుంసభ్యులతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌ చరణ్, ఉపాసన సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్.. ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ హీరోలంతా వరుణ్‌ ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌లో సందడి చేశారు. ఇక నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు వరుణ్‌, లావణ్య. ‘లవ్‌ దొరికిందంటూ’ ఈ లవ్‌ బర్డ్స్‌ షేర్‌ చేసిన ఫొటోలు ఒక్కసారిగా వైరల్‌గామారాయి. కాబోయే పెళ్లి కూతురు లావణ్య కూడా ఇదే ఫోటోలను పోస్ట్ చేస్తూ 2016 నుంచే తమ ఇద్దరి ప్రేమ ఉన్నట్టు తెలిపింది. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. ‘చూడముచ్చటైన జంట, క్యూట్‌ జోడీ’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా టాలీవుడ్‌లో వరుణ్, లావణ్య రెండు సినిమాల్లో కలిసి నటించారు. హీరోగా వరుణ్‌తేజ్‌ ముకుంద చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక అందాల రాక్షసితో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి…ప్రస్తుతం తెలుగు, తమిళచిత్రాలతోపాటు వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. కొంతకాలంగా వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరిగింది. ఈ యేడాది చివరిలోనే వివాహ వేడుక ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?