TOP 9 ET: కల్యాణ వైభోగమే.. వరుణ్ , లావణ్య నిశ్చితార్ధం.. | బాక్సు బద్దలయ్యేలా బాలయ్య..

TOP 9 ET: కల్యాణ వైభోగమే.. వరుణ్ , లావణ్య నిశ్చితార్ధం.. | బాక్సు బద్దలయ్యేలా బాలయ్య..

Anil kumar poka

|

Updated on: Jun 09, 2023 | 9:49 PM

బాలయ్య బర్త్‌డే జూన్ 10న, ఎన్‌బీకె 108ఫిల్మ్ భగవంత్ కేసరి సినిమా నుంచి టీజర్‌ రిలీజ్కు ప్లాన్ చేశారు... మేకర్స్. ఇక కొట్టిన పిండిలా.. బాలయ్యకు.. గూస్‌ బంప్స్ వచ్చే బీజీఎమ్ ఇచ్చే తమన్‌..ఈ సారి కూడా అదే చేసేందుకు ఓ క్రేజీ అడుగేశారు. టీజర్ బీజీఎమ్ కోసమే ఏకంగా 72 మందితో లైవ్ ఆర్కెస్ట్రా పెట్టించారు. వారందరూ లైవ్‌లో వాయిస్తుంటే.. ఆ మ్యూజిక్‌ను రికార్డ్‌ చేసి.. బాలయ్య దాటికి మ్యాచ్ అయ్యేలా.. నెట్ట్ లెవల్‌ సౌండింగ్లో వినిపించబోతున్నారు. అయితే ఇదే విషయమే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

01.Bhola Shankar
మెగా లీక్స్ కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా భోళా శంకర్ సినిమా నుంచి మరో లీక్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఓ సాంగ్ షూట్‌కు సంబంధించిన లోకేషన్ విజువల్స్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. పార్టీ మూడ్‌లో సాగే ఈ పాటలో చిరుతో పాటు తమన్నా, కీర్తి సురేష్‌, సుశాంత్ కూడా ఆడి పాడుతున్నారు. మెహర్‌ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్‌ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్నారు.

02. Adipurush
ఆదిపురుష్ సినిమా రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మైథలాజికల్ జానర్‌లో తెరకెక్కిన ఈ మూవీకి క్లీన్ యూ సర్టిఫికేట్‌ జారీ చేసింది సెన్సార్ బోర్డ్‌. ప్రభాస్ రాఘవుడిగా, కృతిసనన్‌ జానకీగా నటించిన ఈ సినిమాకు ఓం రవుత్ దర్శకుడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో టీ సిరీస్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించింది.

03. Rangabali
నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌ రంగబలి. ఈ సినిమాతో పవన్ బాసంశెట్టిని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూలై 7న రిలీజ్‌కు రెడీ అవుతున్న రంగబలి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు మేకర్స్‌. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

04. Dhoomam
మలయాళ స్టార్ ఫాహద్‌ ఫాజిల్ హీరోగా కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న భారీగా చిత్రం ధూమమ్‌. యు టర్న్‌ ఫేమ్ పవన్‌ కుమార్ రూపొందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు మేకర్స్‌. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

05. Khusi
కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ఖుషి కాంబో మరోసారి రిపీట్ కానుంది. ప్రస్తుతం లియో షూటింగ్‌లో బిజీగా ఉన్న విజయ్‌, నెక్ట్స్ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా సీనియర్ నటి జ్యోతిక నటించబోతున్నారు. ఇప్పటికే కథ విన్న జ్యోతిక ఓకే చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఖుషీ దర్శకుడు ఎస్‌జే సూర్య విలన్‌గా నటించబోతున్నారు.

06.mega akash
మేఘా ఆకాష్‌ త్వరలో ఓ రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లి చేసుకుంటారంటూ వార్తలొచ్చాయి. అయితే, అందులో నిజం లేదని కొట్టి పారేశారు ఆమె తల్లి. మేఘ కొత్త సినిమాకు సైన్‌ చేసినప్పుడు కూడా ఇన్ని ఫోన్‌ కాల్స్ రావని, ఇప్పుడు అందరూ ఫోన్‌ చేస్తుంటే విసుగ్గా ఉందని చెప్పారు. మేఘ ఆకాష్‌ కోలీవుడ్‌ మూవీస్‌తో బిజీగా ఉన్నారు.

07.anupama
అనుపమ పరమేశ్వరన్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో రవితేజతో ఈగిల్‌, సిద్ధు జొన్నలగడ్డతో డీజే టిల్లు స్క్వేర్‌ మూవీస్‌ చేస్తున్నారు. ఈ బ్యూటీ తాజాగా మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అది ట్రావెల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. తమిళ్‌, మలయాళ ప్రాజెక్టులతోనూ బిజీగా ఉన్నారు అనుపమ.

08. Balayya
బాలయ్య బర్త్‌డే జూన్ 10న, ఎన్‌బీకె 108ఫిల్మ్ భగవంత్ కేసరి సినిమా నుంచి టీజర్‌ రిలీజ్కు ప్లాన్ చేశారు… మేకర్స్. ఇక కొట్టిన పిండిలా.. బాలయ్యకు.. గూస్‌ బంప్స్ వచ్చే బీజీఎమ్ ఇచ్చే తమన్‌..ఈ సారి కూడా అదే చేసేందుకు ఓ క్రేజీ అడుగేశారు. టీజర్ బీజీఎమ్ కోసమే ఏకంగా 72 మందితో లైవ్ ఆర్కెస్ట్రా పెట్టించారు. వారందరూ లైవ్‌లో వాయిస్తుంటే.. ఆ మ్యూజిక్‌ను రికార్డ్‌ చేసి.. బాలయ్య దాటికి మ్యాచ్ అయ్యేలా.. నెట్ట్ లెవల్‌ సౌండింగ్లో వినిపించబోతున్నారు. అయితే ఇదే విషయమే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. టీజర్‌పైనే సినిమా రేంజ్‌ అంచనాలను పెంచేస్తోంది.

09. varun – sarvanand –
టాలీవుడ్‌లో పెళ్లికళ ఉట్టిపడుతోంది. వరుణ్‌తేజ్‌ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక వరుణ్‌తేజ్‌ జూన్ 9న స్వగృహంలో జరగింది. కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వేడుక పూర్తయింది. మరోవైపు ఇటీవల జైపూర్‌లో పెళ్లి చేసుకున్న శర్వానంద్‌ ఇండస్ట్రీ సభ్యులకు జూన్ 9నే రిసెప్షన్‌ ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లోని ఎన్‌కన్వెన్షన్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!