AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అభిమానుల రక్తదానం.. ధన్యవాదాలు తెలిపిన అన్నయ్య

గతవారం జరిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటన అందరినీ కలిచివేసింది. బాలాసోర్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ గూడ్స్‌ రైలును ఢీకొనడం, ఆ వెంటనే యశ్వంత్‌ పూర్‌ అదే మార్గంలో రావడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 288 మంది ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

Chiranjeevi: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అభిమానుల రక్తదానం.. ధన్యవాదాలు తెలిపిన అన్నయ్య
Megastar Chiranjeevi
Basha Shek
|

Updated on: Jun 10, 2023 | 6:01 AM

Share

గతవారం జరిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటన అందరినీ కలిచివేసింది. బాలాసోర్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ గూడ్స్‌ రైలును ఢీకొనడం, ఆ వెంటనే యశ్వంత్‌ పూర్‌ అదే మార్గంలో రావడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 288 మంది ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ప్రధానమంత్రి మోడీ మొదలు సామాన్యుల వరకు అందరూ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇక టాలీవుడ్ ప్రముఖులు ఒడిశా ప్రమాద రైలు ఘటనపై స్పందించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి ప్రమాద బాధితులకు రక్తదానం చేయాలని తన ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. అన్నయ్య పిలుపు మేరకు పలువురు అభిమానులు రైలు ప్రమాద క్షతగాత్రులకు సహాయం చేశారు. ఈక్రమంలో ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన రక్తదాతలకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయం చేసేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

‘నా విజ్ఞప్తికి స్పందించి.. ఒడిశాలో బాలసోర్ ట్రైన్ ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా రక్తదానం చేసిన సోదర సోదరి మణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు చిరంజీవి. ఈ సందర్భంగా పలు వార్త పత్రికల్లో వచ్చిన క్లిప్స్‌ ను కూడా షేర్ చేశారు మెగాస్టార్‌. ఇక సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి నటించిన భోళా శంకర్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, కీర్తి సురేశ్‌ చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!