Shani Combust 2023: ఈ రాశులకు రాబోయే 139 రోజులు కష్టాలే.. శని తిరోగమనం ఎవరికి నష్టంగా మారుతుందంటే..?
Shani Combust 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాల స్థితిగతులు మానవ జీవితంపై ప్రభావం చూపగలవు. ఈ ప్రభావాలు కొన్ని రాశాలవారికి శుభంగానూ, మరి కొందరికీ అశుభంగానూ పరిణమిస్తాయి. అయితే జూన్ 17న శనిదేవుడు కుంభరాశిలోకి తిరుగమనం చేయబోతున్నాడు. అదే రాశిలో నవంబర్ 4 వరకు..
Shani Combust 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాల స్థితిగతులు మానవ జీవితంపై ప్రభావం చూపగలవు. ఈ ప్రభావాలు కొన్ని రాశాలవారికి శుభంగానూ, మరి కొందరికీ అశుభంగానూ పరిణమిస్తాయి. అయితే జూన్ 17న శనిదేవుడు కుంభరాశిలోకి తిరుగమనం చేయబోతున్నాడు. అదే రాశిలో నవంబర్ 4 వరకు సంచరించనున్నాడు. ఫలితంగా రాశిచక్రంలోని 4 రాశులవారిపై శనిప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఆయా రాశులవారు ఎన్నో రకాలుగా కష్టాలను ఎదుర్కొంటారు, ప్రతికూల వాతావరణం వారిని వేధిస్తుంది. మరి ఆ రాశులేమిటో ఇప్పుడు చూద్దాం..
మేష రాశి: కుంభరాశిలోకి శని తిరోగమనం మేషరాశి వారికి కష్టాలను తీసుకొస్తుంది. ఈ క్రమంలో ఈ రాశివారు నవంబర్ 4 వరకు కూడా ఎంతో జాగ్రత్త వహించాలి. అప్పటివరకు మీకు భారీగా ఆర్థిక నష్టం, కెరీర్‌లో అనేక అడ్డంకులు, వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది.
వృషభరాశి: శని తిరోగమనం వృషభరాశివారికి కూడా ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో వృషభరాశివారు ఆరోగ్యార్థిక సమస్యలతో సతమతమవుతారు. ముఖ్యంగా మీకు ఇది పెట్టుబడి పెట్టడానికి తగిన సమయం కానే కాదని నిపుణులు చెబుతున్నారు.
కర్కాటక రాశి: కుంభరాశికి శనిగ్రహ తిరోగమనం కారణంగా కర్కాటక రాశి కష్టాలపాలవుతారు. ఆర్థిక నష్టం కలగడంతో పాటు కుటుంబ సమస్యలతో ప్రశాంతతను కోల్పోతారు. అనవసర సమస్యల నుంచి బయటపడేందుకు ఈ సమయంలో మీరు తగినంత మౌనంగా ఉండడం మంచింది.
కుంభరాశి: శని తిరోగమనం కుంభరాశిలోనే జరుగుతోంది కాబట్టి ఈ సమయం ఈ రాశివారికి ప్రతికూలంగా మారుతుంది. ఫలితంగా మీరు మానసిక, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).