ICC World Cup 2023: వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. టీమిండియా మ్యాచులు, వేదికల వివరాలివే
క్రికెట్ అభిమానులను మరో మెగా టోర్నీ అలరించబోతోంది. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించింది. వరల్డ్ కప్‌కు తొలిసారి ఇండియా పూర్తిస్థాయిలో ఆతిథ్యం ఇవ్వబోతోంది.

క్రికెట్ అభిమానులను మరో మెగా టోర్నీ అలరించబోతోంది. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించింది. వరల్డ్ కప్‌కు తొలిసారి ఇండియా పూర్తిస్థాయిలో ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే.. హైదరాబాద్ వేదికగా భారత్‌కు ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడం తెలుగు ఫ్యాన్స్‌ను నిరాశ పరుస్తోంది. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది. వరల్డ్ కప్ షెడ్యూల్‌ను బీసీసీఐ.. ఐసీసీతో పంచుకుంది. ఆ తర్వాత మిగతా దేశాలకు పంపి.. వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాక వరల్డ్ కప్ ఫైనల్ షెడ్యూల్‌ను ఐసీసీ అధికారకంగా ప్రకటించనుంది. మొత్తం 10 టీమ్‌లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లను నిర్ణయించనుంది ఐసీసీ. ఇక.. బీసీసీఐ ఖరారు చేసిన డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. రన్నరప్ జట్టు న్యూజిలాండ్ తలపడే మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ ఏడాది తొలి వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. అయితే.. నవంబర్ 15, 16 తేదీల్లో జరిగే సెమీ ఫైనల్స్ కోసం వేదికలను ఇంకా ప్రకటించలేదు.
టీమిండియా షెడ్యూల్ ఇదే..
ఇక.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా తొలి మ్యాచ్ తలపడనుంది భారత్. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న జరగనుంది. భారత్ లీగ్ దశ మ్యాచ్‌లను మొత్తం 9 నగరాల్లో ఆడనుంది.
డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం.. భారత్ ఆడే లీగ్ మ్యాచ్‌లను ఒకసారి పరిశీలిస్తే…




- అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో..
- అక్టోబర్ 11న ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో..
- అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో..
- అక్టోబర్ 19న పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో..
- అక్టోబర్ 22న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో..
- అక్టోబర్ 29న లఖ్‌నవూ వేదికగా ఇంగ్లాండ్‌తో..
- నవంబర్ 2న ముంబయి వేదికగా క్వాలిఫయర్ జట్టుతో..
- నవంబర్ 5న కోల్‌కతా వేదిక దక్షిణాఫ్రికాతో..
- నవంబర్ 11న బెంగళూరు వేదికగా క్వాలిఫయర్ జట్టుతో..
హైదరాబాదీలకు నిరాశే?.
మరోవైపు.. పాకిస్థాన్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఒకసారి పరిశీలిస్తే… పాకిస్థాన్ ఐదు నగరాల్లో లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 6, 12 తేదీల్లో హైదరాబాద్ వేదికగా క్వాలిఫయర్‌కు అర్హత సాధించిన జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్‌తో, అక్టోబర్ 20న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 23న చెన్నై వేదికగా అఫ్గానిస్థాన్‌తో, అక్టోబర్ 27న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అక్టోబర్ 31న కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో , నవంబర్ 5న బెంగళూరులో న్యూజిలాండ్‌తో, నవంబర్ 12న కోల్‌కతా వేదికగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడనుంది పాకిస్థాన్.
ఇదిలావుంటే.. వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలని ఎదురుచూస్తోన్న తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలేలా ఉంది. అన్ని ప్రధాన స్టేడియాల‌్లో టీమ్ఇండియా మ్యాచ్‌లకు అవకాశాన్ని కల్పించిన బీసీసీఐ.. ఉప్పల్ స్టేడియాన్ని మాత్రం విస్మరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఉప్పల్‌లో పాకిస్థాన్ మాత్రం రెండు క్వాలిఫయర్ మ్యాచ్‌లను ఆడనుంది. పాకిస్థాన్‌కు ఉప్పల్‌లో ఛాన్స్ ఇచ్చి టీమ్ఇండియాకు అవకాశం ఇవ్వకపోవడం తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌ను డిజపాయింట్ గురిచేస్తోంది. ఏదేమైనా.. వన్డే వరల్డ్ కప్‌కు టీమ్ఇండియా పూర్తిస్థాయిలో తొలిసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. గతంలో 1987, 1996, 2011లో ఆసియా దేశాలతో కలిసి వన్డే వరల్డ్ కప్‌కు టీమ్ ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. ఈ సారి మాత్రం మొత్తం మ్యాచ్‌లన్నీ ఇండియాలోనే జరుగనున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




