AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఈ క్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. క్రేజ్‌లో నెక్ట్స్‌ లెవెల్‌ అంతే.. ఎవరో గుర్తుపట్టారా?

ఇందులో కృష్ణుడి గెటప్‌లో ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్నది ఓ స్టార్‌ హీరోయిన్‌. పుట్టింది కేరళలో అయినా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంటుంది. తన అందం, అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందామె. ముఖ్యంగా యంగ్ హీరోలు ఆమె పక్కన నటించేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు.

కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఈ క్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. క్రేజ్‌లో నెక్ట్స్‌ లెవెల్‌ అంతే.. ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jun 12, 2023 | 11:22 AM

Share

తల్లిదండ్రులు తమ పిల్లలకు వివిధ రకాల గెటప్‌లు వేసి మురిసిపోతుంటారు. ముఖ్యంగా కృష్ణాష్ణమి పర్వదినాల సమయంలో తమ బిడ్డలకు కృష్ణుడి వేషాలు వేసి తెగ మురిసిపోతుంటారు. కిట్టయ్య గెటప్‌లో పిల్లలు ఎంతో క్యూట్‌గా కనిపించడమే దీనికి కారణం. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా తమ పిల్లలను కృష్ణుడిలా ముస్తాబు చేస్తుంటారు. పైన ఉన్న ఫొటో కూడా ఈ కోవకే చెందుతుంది. ఇందులో కృష్ణుడి గెటప్‌లో ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్నది ఓ స్టార్‌ హీరోయిన్‌. పుట్టింది కేరళలో అయినా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంటుంది. తన అందం, అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందామె. ముఖ్యంగా యంగ్ హీరోలు ఆమె పక్కన నటించేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అన్నట్లు ఈమె ఉంగరాల జుట్టుకు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారండోయ్‌. ఈపాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో అని. యస్‌. తను మరెవరో కాదు అనుపమా పరమేశ్వరన్‌. ప్రేమమ్‌ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

శర్వానంద్‌ శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్‌ ఐలవ్యూ, హలో గురూ ప్రేమ కోసమే, రౌడీ బాయ్స్‌ సినిమాలతో ట్యాలెంటెడ్‌ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనుపమ. ఇక కార్తికేయ 2 సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. అదే సమయంలో బటర్‌ ఫ్లై, 18 పేజేస్‌ వంటి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో మంచి హిట్ సినిమాలు ఖాతాలో వేసుకుంది. త్వరలోనే సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి టిల్లు స్క్వేర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు సైరన్‌, ఈగల్‌ వంటి క్రేజీ సినిమాలు అనుపమ చేతిలో అనుపమ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.