AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చబొట్టు చూపిస్తూ వయ్యారాలు పోతున్న ఈ అందాల నటిని గుర్తుపట్టారా? మరో సూర్యకాంతం అంటారండోయ్ చాలామంది..

పై ఫొటోలో పచ్చబొట్టు చూపిస్తూ మురిసిపోతున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా? యాంకర్‌గా, నటిగా టాలీవుడ్‌లో ఈమెకు ప్రత్యేక గుర్తింపు ఉందండోయ్‌. బుల్లితెర, బిగ్‌ స్క్రీన్‌ అన్న తేడా లేకుండా నటనలో అదరగొట్టింది. ఒక ప్రత్యేకమైన స్లాంగ్‌తో తను చెప్పే డైలాగులకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.

పచ్చబొట్టు చూపిస్తూ వయ్యారాలు పోతున్న ఈ అందాల నటిని గుర్తుపట్టారా? మరో సూర్యకాంతం అంటారండోయ్ చాలామంది..
Actress
Basha Shek
|

Updated on: Jun 11, 2023 | 6:05 AM

Share

పై ఫొటోలో పచ్చబొట్టు చూపిస్తూ మురిసిపోతున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా? యాంకర్‌గా, నటిగా టాలీవుడ్‌లో ఈమెకు ప్రత్యేక గుర్తింపు ఉందండోయ్‌. బుల్లితెర, బిగ్‌ స్క్రీన్‌ అన్న తేడా లేకుండా నటనలో అదరగొట్టింది. ఒక ప్రత్యేకమైన స్లాంగ్‌తో తను చెప్పే డైలాగులకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె నటనను చూసి మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఒక సందర్భంలో సూర్యకాంతంలా పేరు సంపాదిస్తుందని కితాబిచ్చారు. అన్నట్లు ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో కూడా ఈ బ్యూటీ సందడి చేసిందండోయ్‌. అయితే ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండలేకపోయింది. ఇక తల్లైన తర్వాత మేకప్‌కు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల కమ్‌ బ్యాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అందుకే సన్నజాజితీగలాగా మారి షాక్‌ ఇచ్చింది. ఆ ఫొటోలను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టారా? కనిపెట్టకపోయినా నో ప్రాబ్లమ్‌.. ఆన్సర్‌ కూడా మేమే చెబుతాం లెండి. ఆమె మరెవరో కాదు యాంకర్‌ కమ్ యాక్ట్రెస్‌ హరితేజ.

తిరుపతికి చెందిన హరితేజ బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్‌ మొదలెట్టింది. ఆ తర్వాత మనసు-మమత, ముత్యమంత పసుపు వంటి సీరియల్స్‌లో నటించింది. ఆపై వెండితెరపై కూడా అడుగుపెట్టింది. దమ్ము, దువ్వాడ జగన్నాధం, అనగనగా ఓ ధీరుడు , విన్నర్ , అత్తారింటికి దారేది , ఉంగరాల రాంబాబు , రాజా ది గ్రేట్ వంటి తెలుగు చిత్రాలలో నటించింది. ముఖ్యంగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ‘అఆ’ సినిమాలో ఆమె పోషించిన మంగమ్మ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. దీపక్‌తో అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న హరితేజ.. 2021లో ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి మేకప్‌కు దూరంగా ఉంది. అయితే ఇటీవల మళ్లీ సినిమా ఫంక్షన్లలోనూ కనిపిస్తూ సందడి చేస్తోంది. అలాగే నెట్టింట హాట్‌ ఫొటోలు షేర్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?