AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Babu: అప్పుడు పవన్‌ని నడిపించాను.. ఇప్పుడు తన అడుగుజాడల్లో నడుస్తున్నా.. నాగబాబు ఎమోషనల్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, మెగా బ్రదర్‌ నాగబాబుల మధ్య ఉన్నఅనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తన కంటే చిన్నవాడైన పవన్‌ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు నాగబాబు. తన వెన్నంటే ఉంటూ అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారు. అంతేకాదు పవనే తనకు స్ఫూర్తి అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు నాగబాబు.

Naga Babu: అప్పుడు పవన్‌ని నడిపించాను.. ఇప్పుడు తన అడుగుజాడల్లో నడుస్తున్నా.. నాగబాబు ఎమోషనల్‌
Naga Babu, Pawan Kalyan
Basha Shek
|

Updated on: Jun 11, 2023 | 6:10 AM

Share

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, మెగా బ్రదర్‌ నాగబాబుల మధ్య ఉన్నఅనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తన కంటే చిన్నవాడైన పవన్‌ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు నాగబాబు. తన వెన్నంటే ఉంటూ అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారు. అంతేకాదు పవనే తనకు స్ఫూర్తి అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు నాగబాబు. ముఖ్యంగా ఆరెంజ్‌ సినిమా తర్వాత నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన తనలో పవన్‌ కల్యాణే ధైర్యం నింపాడని చెప్పారు. ఈక్రమంలో పవన్‌తో పాటు అతను స్థాపించిన జనసేన పార్టీకి కూడా అన్ని రకాలుగా మద్దతు నిస్తున్నారు మెగా బ్రదర్‌. పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈక్రమంలో పవన్‌ను ఉద్దేశిస్తూ నాగబాబు చేసిన ఒక ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఎంగెజ్‌మెంట్‌ వేడుక శుక్రవారం రాత్రి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు పవన్‌కల్యాణ్‌ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్‌ను సాదరంగా ఆహ్వానించారు నాగబాబు. అతని వెనకాలే నడుచుకుంటూ ఎంగేజ్‌మెంట్ వేదిక దగ్గరకు వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోను ట్వీట్టర్‌లో షేర్‌ చేసిన నాగబాబు ‘ అతను పిల్లాడిగా ఉన్నప్పుడు, సరైన మార్గంలో ఎలా నడవాలి? వ్యవహరించాలి? అని నేను మార్గనిర్దేశం చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు మేమిద్దరం పెద్దవాళ్లమయ్యాం. పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానాలకి ఎదిగాడు. సరైన మార్గంలో నడిచే అవగాహన సంపాదించాడు. అందుకే, నేను అతని అడుగుజాడల్లో నడుస్తున్నాను’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘అన్నదమ్ముల అనుబంధం’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..