Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: సంస్కారానికి ప్రతిరూపం రామ్‌ చరణ్‌.. శర్వా రిసెప్షన్‌లో బాలయ్యను చూడగానే ఏం చేశాడో తెలుసా?

టాలీవుడ్‌ అగ్రనటులైన మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వీరిద్దరూ ఎప్పుడు, ఎక్కడ కలిసినా.. హాయిగా జోకులేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటారు. చిరు, బాలయ్యల మధ్యనే కాదు వారి కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి.

Ram Charan: సంస్కారానికి ప్రతిరూపం రామ్‌ చరణ్‌.. శర్వా రిసెప్షన్‌లో బాలయ్యను చూడగానే ఏం చేశాడో తెలుసా?
Ramcharan, Balayya
Follow us
Basha Shek

|

Updated on: Jun 12, 2023 | 7:59 AM

టాలీవుడ్‌ అగ్రనటులైన మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వీరిద్దరూ ఎప్పుడు, ఎక్కడ కలిసినా.. హాయిగా జోకులేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటారు. చిరు, బాలయ్యల మధ్యనే కాదు వారి కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంతో సరదాగా ఉంటాడు బాలయ్య. సాయి ధరమ్‌ తేజ్‌ లాంటి హీరోలు బాలయ్య అంటే పడి చస్తారు. అయితే కొందరు మాత్రం చిరంజీవి, బాలయ్యలకు అసలు పడదంటూ రూమర్లను సృష్టిస్తున్నారు. కొందరు అభిమానులు కూడా ఒకరిపై ఒకరు సెటైర్లు, విమర్శలు చేసుకుంటుంటారు. అయితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేమని, తామంతా ఒకటేనని మరోసారి చాటి చెప్పాడు రామ్‌ చరణ్‌, బాలకృష్ణ. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ ప్రామిసింగ్‌ హీరో శర్వానంద్‌ రిసెప్షన్‌కు హాజరయ్యారు రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులు. కొత్త దంపతులకు అభినందనలు తెలిపి వెళుతుండగా.. అదే సమయంలో బాలకృష్ణ ఎదురుగా వచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య బాబును చూడగానే రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేశాడు చెర్రీ. ఆ తర్వాత దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. బాలకృష్ణ కూడా రామ్ చరణ్‌ను చూసి భుజం తట్టి ప్రేమతో పలకరించారు. ఉపాసనను కూడా కుశల ప్రశ్నలు ఆడిగారు.

రామ్‌ చరణ్‌, బాలయ్యల మీటింగ్‌లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్‌, నందమూరి ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. రామ్‌ చరణ్‌ సంస్కారానికి ప్రతి రూపమంటూ పొగిడేస్తున్నారు మెగా ఫ్యాన్స్‌. ఇక వీరిద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూసి పండగ చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు. ఇటీవల ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలకు కూడా హాజరయ్యారు రామ్ చరణ్‌. ఈ సందర్భంగా బాలయ్య దగ్గరుండి మరీ చెర్రీని వేదిక దగ్గరకు తీసుకెళ్లాడు. అలాగే అన్‌స్టాపబుల్‌ షోలో పవన్‌ కల్యాణ్‌ వచ్చినప్పుడు కూడా చరణ్‌తో ఫొన్‌లో మాట్లాడారు బాలయ్య. తండ్రి కాబోతున్నందుకు శుభాకాంక్షలు కూడా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..