AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush Movie Tickets: ప్రతి రామాలయానికి ఆదిపురుష్ 100 టిక్కెట్లు ఉచితం.. తెలంగాణలోని ఆ జిల్లాకు మాత్రమే

రణ్‌బీర్‌ కపూర్‌ లాంటి స్టార్‌ హీరోలు పిల్లలందరూ ప్రభాస్‌ సినిమాను చూడాలని 10వేలకు పైగా టికెట్లను ముందుగా బుక్‌ చేయనున్నారు. ఇప్పుడీ మంచి కార్యంలో శ్రేయాస్‌ మీడియా కూడా పాలుపంచుకోనుంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 100+1(101) టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్‌ మీడియా అధినేత గండ్ర శ్రీనివాస్‌ రావు తెలిపారు.

Adipurush Movie Tickets: ప్రతి రామాలయానికి ఆదిపురుష్ 100 టిక్కెట్లు ఉచితం.. తెలంగాణలోని ఆ జిల్లాకు మాత్రమే
Adipurush Movie
Basha Shek
|

Updated on: Jun 12, 2023 | 7:07 AM

Share

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం ఆదిపురుష్‌. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ పౌరాణికచిత్రంలో కృతీసనన్‌ సీతమ్మగా నటించింది. భూషణ్‌ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్‌ రౌత్, ప్రసాద్‌ సుతారియా, రెట్రోఫిల్స్‌ రాజేష్‌ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌ సుమారు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మైథలాజికల్‌ మూవీ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ ఎత్తున ప్రభాస్‌ రిలీజ్‌ చేస్తోంది. కాగా రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటుకి హనుమంతుడు విచ్చేస్తాడన్న నమ్మకంతో ఆది పురుష్‌ ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును ఖాళీగా ఉంచనున్నారు. అలాగే రణ్‌బీర్‌ కపూర్‌ లాంటి స్టార్‌ హీరోలు పిల్లలందరూ ప్రభాస్‌ సినిమాను చూడాలని 10వేలకు పైగా టికెట్లను ముందుగా బుక్‌ చేయనున్నారు. ఇప్పుడీ మంచి కార్యంలో శ్రేయాస్‌ మీడియా కూడా పాలుపంచుకోనుంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 100+1(101 ) ఆది పురుష్ టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్‌ మీడియా అధినేత గండ్ర శ్రీనివాస్‌ రావు తెలిపారు. టిక్కెట్లు కావాల్సిన వారు తమను సంప్రదించాలని సోషల్‌ మీడియా వేదికగా కోరారు.

‘శ్రీరాముడు, సీతమాత గాథ అందరికీ ఆదర్శం. ఆ దివ్యమైన చరిత్రే ఆదిపురుష్‌ సినిమా. ఆ ఆదర్శవంతమైన దివ్య మంగళ చరిత్ర ప్రతి ఒక్కరికి చేరాలనే సంకల్పంతో ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలోని ప్రతి రామాలయానికి 100 టిక్కెట్లు ఇవ్వదల్చుకున్నాం. టికెట్లు కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు’ అని శ్రేయాస్‌ మీడియా ట్వీట్‌ చేసింది. ఆది పురుష్‌ సినిమాలో బాలీవుడ్‌ విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్ , ట్రైలర్స్ సినిమా పై అంచనాలను అమాంత పెంచేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చైనా గడ్డపై తెలుగమ్మాయి గర్జన.. వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
చైనా గడ్డపై తెలుగమ్మాయి గర్జన.. వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..