AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Headaches: తరచూ తలనొప్పి వస్తోందా? లైట్ తీసుకోవద్దు.. డేంజర్ వ్యాధికి సంతేకతం కావచ్చు!

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా జనాలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో తలనొప్పి కూడా ఒకటి. అయితే చాలా మంది దీన్ని చాలా సాధారణ సమస్యగా భావిస్తారు. తలనొప్పి వచ్చినప్పుడు ఓ టాబ్లెట్ వేసుకొని వదిలేస్తారు. ఇలా ఎన్ని సార్లు జరిగినా రిపీట్ చేస్తూనే ఉంటారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఫ్యూచర్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీర్ఘకాలిక తలనొప్పి కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Aug 17, 2026 | 1:19 PM

Share
తలనొప్పి.. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కనిపించే సమస్య. విశ్రాంతి లేకపోవడం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఇలా తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ తలనొప్పి అధికంగా ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడూ తలనొప్పికి కారణం ఒకటే ఉండదు. జీవనశైలి మార్పులతో పాటు అంతర్గత సమస్యల వల్ల కూడా రావచ్చు.

1 / 5
మళ్లీ మళ్లీ తలనొప్పి వచ్చేందుకు కారణాలు: మైగ్రేన్.. ఈ సమస్య కారణంగా తరచూ మీకు తలనొప్పి వస్తుంది. కొన్నిసార్లు ఒకే వైపు నొస్తే.. కొన్నిసార్లు రెండు వైపుల నుంచి భరించలేని తలనొప్పి వస్తుంది. అంతేకాకుండా ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల, దేని గురించైనా ఎక్కువగా ఆలోచించినప్పుడు తలనొప్పి వస్తుంది. అంతేకాదు రక్తనాళాల సమస్య, మెనింజైటిస్, బ్రెయిన్ ట్యూమర్, తలకు గాయం కారణంగా కూడా నిరంతర తలనొప్పి రావచ్చు.

2 / 5
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీకు తరచూ తలనొప్పి వస్తుంటే మీరు వెంటనే అప్రమత్తమవ్వాలి. తలనొప్పిని తగ్గించాలంటే రోజూ తగినంత నీరు తాగడంతో పాటు సరైన నిద్ర, సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం. అంతేకాదు రాత్రి సమయంలో ఫోన్ పక్కన పెట్టడం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి నడక, యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవడం ఉత్తమం. మీ రోజువారీ జీవనశైలిలో ఈ చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మీరు పెద్ద సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

3 / 5
డాక్టర్ దగ్గరకు ఎప్పుడు వెళ్లాలి: మీకు సాధారణ తలనొప్పి కాకుండా తరచూ ఎక్కువగా రావడం, తలనొప్పి కారణంగా మీరు మీ రోజువారీ పనులను చేసుకోలేకపోతున్నా, మాట్లాడటంలో ఇబ్బంది, స్పృహ తప్పడం, గందరగోళం, బలహీనత, శరీర భాగం మొద్దుబారడం, చూపు మందగించడం లేదా నడవడంలో సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి.

4 / 5
లేదా తలకు గాయం అయిన తర్వాత తలనొప్పి మొదలైనా, తీవ్రమైన జ్వరం, మెడ పట్టేయడంతో కూడిన నొప్పి ఉన్నప్పుడు వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. ఇలాంటి సమయంలో మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇవి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ఈ సమస్యలకు కారణం తెలుసుకొని అప్పుడే పరిష్కరించుకోవడం ఉత్తమం.

5 / 5
Follow Us