AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: హైదరాబాద్‌లో కీర్తి సురేశ్‌.. అర్ధరాత్రి మాస్క్‌ పెట్టుకుని టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లిన మహానటి

సర్కారువారిపాట, దసరా సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు ఖాతాలో వేసుకుంది మహానటి కీర్తి సురేశ్‌. ముఖ్యంగా నాని హీరోగా వచ్చిన దసరా సినిమాలో కీర్తి అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమా కూడా సూపర్‌ హిట్‌ కావడంతో కీర్తి సురేశ్‌కు మళ్లీ అవకాశాలు పెరుగుతున్నాయి. ఆమె చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మెగాస్టార్‌ చిరంజీవి భోళాశంకర్‌ కూడా ఒకటి.

Keerthy Suresh: హైదరాబాద్‌లో కీర్తి సురేశ్‌.. అర్ధరాత్రి మాస్క్‌ పెట్టుకుని టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లిన మహానటి
Keerthy Suresh
Basha Shek
|

Updated on: Jun 12, 2023 | 10:05 AM

Share

సర్కారువారిపాట, దసరా సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు ఖాతాలో వేసుకుంది మహానటి కీర్తి సురేశ్‌. ముఖ్యంగా నాని హీరోగా వచ్చిన దసరా సినిమాలో కీర్తి అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమా కూడా సూపర్‌ హిట్‌ కావడంతో కీర్తి సురేశ్‌కు మళ్లీ అవకాశాలు పెరుగుతున్నాయి. ఆమె చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మెగాస్టార్‌ చిరంజీవి భోళాశంకర్‌ కూడా ఒకటి. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, చిరంజీవి చెల్లెలిగా కీలకమైన పాత్రలో కీర్తి కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందుకోసం కొన్ని రోజులుగా సిటీలోనే ఉంటుందామె. తాజాగా తన టీమ్‌తో కలిసి నగరంలో చక్కర్లు కొట్టింది కీర్తి. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లింది. అక్కడ అందరితో కలిసి టిఫిన్‌ చేసింది. అలాగే తందూరీ టీని కూడా టేస్ట్‌ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమేనే ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసింది. ‘ఈవీకెండ్ ఎంతో అద్భుతంగా గడిచింది’ అని దీనికి క్యాప్షన్‌ ఇచ్చింది. అయితే, బయటవాళ్లెవరూ తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు కీర్తి సురేశ్‌. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన అజిత్‌ వేదాళం తెలుగు రీమేక్‌గా భోళాంకర్‌ తెరకెక్కుతోంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన సినిమా స్టిల్స్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆగస్టులో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. భోళాశంకర్‌తో పాటు మామన్నన్‌, సైరన్‌, రివాల్వర్‌ రీటా వంటి క్రేజీ ప్రాజెక్టులు కీర్తి చేతిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..