- Telugu News Photo Gallery Sports photos ICC World Cup 2023: Team India Captain Rohit Sharma and Coach Dravid eyes World Cup 2023 glory for India
ICC World Cup 2023: కాలం కలిసి వచ్చేనా? రోహిత్ శర్మకు ఇదే చివరి అవకాశం..!
Team India: ఆసియా కప్, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, వన్డే ప్రపంచకప్ కోసం పురుషులు క్రికెట్ టీమ్‌లో మార్పులు చేసిన్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా పోతోంది. కొత్త కెప్టెన్, కొత్త కోచ్, కొత్త టీమ్‌ను సిద్ధం చేసినా.. నిరాశే మిగులుతుంది.
Updated on: Jun 13, 2023 | 10:00 AM

కొత్త కెప్టెన్, కొత్త కోచ్, కొత్త జట్టు అయితేనేం.. ఐసీసీ ట్రోఫీని గెలవాలన్న టీమిండియా కల మాత్రం కలగానే మిగిలిపోయింది. 2021 టీ20 ప్రపంచకప్ ఓటమి తర్వాత టీమ్ ఇండియాకు పెద్ద శస్త్రచికిత్సే చేశారు.

విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుండి తొలగించి, రోహిత్ శర్మను నియమించడం జరిగింది. ఇక కోచ్ రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ను కొత్త కోచ్‌గా నియమించారు.

ఆసియా కప్, ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ODI ప్రపంచ కప్‌ల నేపథ్యంలో ఈ భారీ మార్పులు చేశారు. అయినప్పటికీ ఈ మార్పు ఇప్పటి వరకు ఫలితాలను ఇవ్వలేదు. ఆడిన రెండు టోర్నీల్లోనూ టీమిండియా చతికిలపడింది. ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.

ఆసియా కప్‌లో సూపర్-4 దశకు చేరుకున్న భారత జట్టు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌లో కప్పు గెలుస్తుందని భావించినా.. చివరకు నిరాశే మిగిల్చారు టీమిండియా క్రికెటర్లు. దీంతో 2013 తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలవాలన్న టీమిండియా కల కలగానే మిగిలిపోయింది.

అయితే టీమ్ ఇండియా ముందు మరో పెద్ద ట్రోఫీ ఉంది. అదే వన్డే ప్రపంచకప్. అక్టోబరు-నవంబర్‌లో భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలవడం టీమ్‌ఇండియాకు అతిపెద్ద సవాల్.

అయితే కేవలం 4 నెలల్లోనే ఈ ట్రోఫీకి సిద్ధమవ్వడమే అతిపెద్ద సవాలు. ఈ సిరీస్ కోసం టీమ్ ఇండియా బలమైన జట్టును నిర్మించుకోవాలి. ఈ జట్టును రోహిత్ శర్మ విజయవంతంగా నడిపించాలి.

వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. కానీ భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడంలో విఫలమైతే కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది.

అందుకే, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌లకు వన్డే ప్రపంచకప్ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీతో మరో ఏడాది పాటు టీమిండియా ఆడాలంటే వన్డే ప్రపంచకప్ తప్పక గెలవాలి. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్ హిట్ మ్యాన్‌కు చివరి ఛాన్స్ అని విశ్లేషిస్తున్నారు.




