AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TCS Female Employees: టీసీఎస్‌కు మహిళా ఉద్యోగుల షాక్.. రాజీనామాల పర్వానికి కారణమిదే..!

గతంలో కుటుంబ సభ్యులకు దూరంగా ఎక్కడో మెట్రో సిటీల్లో వర్క్ చేసేవారు కరోనా దెబ్బకు వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల వరూ వర్క్ ఫ్రమ్ హోం అవకాశాన్ని ఉద్యోగస్తులకు కల్పించాయి. అయితే క్రమేపి కరోనా విపత్కర పరిస్థితులు తగ్గడంతో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు కంపెనీలు పాట్లు పడుతన్నాయి.

TCS Female Employees: టీసీఎస్‌కు మహిళా ఉద్యోగుల షాక్.. రాజీనామాల పర్వానికి కారణమిదే..!
Employees
Follow us
Srinu

|

Updated on: Jun 15, 2023 | 6:00 PM

భారతదేశంలో ఐటీ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ వేరు. ఐదంకెల జీతం, వారానికి కేవలం ఐదు రోజుల వర్క్ అనేసరికి ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఏ ఇంజినీరింగ్ గ్రాడ్యూయేట్ అయిన ఆఖరికి ఐటీలోనే ఉద్యోగం చేస్తున్నారు. అయితే 2020లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లయ్యింది. గతంలో కుటుంబ సభ్యులకు దూరంగా ఎక్కడో మెట్రో సిటీల్లో వర్క్ చేసేవారు కరోనా దెబ్బకు వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల వరూ వర్క్ ఫ్రమ్ హోం అవకాశాన్ని ఉద్యోగస్తులకు కల్పించాయి. అయితే క్రమేపి కరోనా విపత్కర పరిస్థితులు తగ్గడంతో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు కంపెనీలు పాట్లు పడుతన్నాయి. ప్రారంభంలోనే తీవ్ర వ్యతిరేకత రావడంతో చాలా కంపెనీలు క్రమేపి ఉద్యోగులను ఆఫీసులకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే ఉద్యోగాలను వదిలేసే పరిస్థితి ఏర్పడింది.

తాజాగా భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో వర్క్ ఫ్రం హోం ముగిసింది. దీంతో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయడానికి ఇష్టం లేని వారు ఉద్యోగాలను వదిలేస్తున్నారు. ముఖ్యంగా వీరిలో మహిళా ఉద్యోగులే ఎక్కువ శాతం మంది ఉన్నట్లు నివేదికల ద్వారా తెలస్తుంది. టీసీఎస్ ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేకంగా అవకాశాలను కల్పిస్తుంది. అలాగే మహిళలకు అనేక ఉపాధి అవకాశాలను అందించే టీసీఎస్ ప్రసిద్ధి చెందింది. అయితే మహిళా ఉద్యోగుల వేగవంతమైన రాజీనామాకు దారితీసే అంశాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూఎఫ్‌హెచ్) నిర్ణయం కూడా ఒకటని కంపెనీ పేర్కొంది. మహిళా ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి కంపెనీ అనుమతించడం మానేసిన తర్వాత వారి నుండి ఎక్కువ మంది రాజీనామాలు చేశారని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మహిళలు ఉద్యోగాలు మానేయడానికి ఇతర కారణాలున్నా ఇదే ప్రధానం కారణంగా నిలుస్తుంది.

ప్రస్తుతం టీసీఎస్‌లో 6,00,000 మందికి పైగా పని చేస్తున్నారు, అందులో 35 శఆతం మంది మహిళలు ఉన్నారు. టీసీఎస్ 2023 ఆర్థిక సంవత్సరంలో 38.1 శాతం మహిళా ఉద్యోగులు టీసీఎస్‌లో పని చేస్తున్నారు. అంటే కంపెనీ ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగులు మూడు వంతుల మంది ఉన్నారు. అలాగే టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కోల్పోయింది. ఈ పాలసీ కారణంగా ఎంత మంది మహిళా ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టారనే దాని గురించి టీసీఎస్ ఖచ్చితమైన సంఖ్యను చెప్పలేదు. అయితే తాజా నియామకాలతో ఉద్యోగుల్లో 35.7% మహిళా అసోసియేట్‌లతో కలిపి 614,000 మంది పెరిగారిన కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం