ఆఫీసుకు రావాల్సిందే.. ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవంటూ ఉద్యోగులు టెక్ దిగ్గజం నోటీసులు
Work From Home: కరోనా సంక్షోభంతో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ విధానం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేవలం టెక్ కంపెనీలకే పరిమితం కాకుండా కొన్ని ఇతర కంపెనీలు సైతం ఈ విధానాన్నే అవలంభిస్తున్నాయి. అయితే కరోనా ప్రభావం ముగిసిన తర్వాత కూడా ఇంకా ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడానికి ఇష్టం చూపడం లేదు...

Work From Home: కరోనా సంక్షోభంతో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ విధానం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేవలం టెక్ కంపెనీలకే పరిమితం కాకుండా కొన్ని ఇతర కంపెనీలు సైతం ఈ విధానాన్నే అవలంభిస్తున్నాయి. అయితే కరోనా ప్రభావం ముగిసిన తర్వాత కూడా ఇంకా ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడానికి ఇష్టం చూపడం లేదు. దీంతో కంపెనీలు కూడా చేసేదేం లేక ఇర్క్ ఫ్రం హోమ్ విధానాన్నే పాటిస్తున్నాయి. అయితే ఉద్యోగులను నెమ్మదిగా తిరిగి ఆఫీస్ బాట పట్టిచేందుకు హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ కూడా వారంలో మూడు రోజుల పాటు ఆఫీసు నుంచే వర్క్ చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. దీన్ని పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటూ ఉద్యోగులకు తాజాగా హెచ్చరికలు జారీ చేస్తోంది.
నెలలో 12 రోజులు ఆఫీసు నుంచే పని చేయాలని టీసీఎస్ ఉద్యోగులకు గత అక్టోబర్ నుంచే సూచిస్తోంది. అయితే కొందరు ఉద్యోగులు దీనిని పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో అలాంటి వారికి తాజాగా నోటీసులు పంపించడం మొదలుపెట్టిన టీసీఎస్.. రోస్టర్ ప్రకారం నిర్దేశించిన కార్యాలయానికి తక్షణమే వచ్చి రిపోర్టు చేయాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని తెలిపింది.
దీనిపై టీసీఎస్ స్పందిస్తూ.. గత రెండేళ్లుగా కంపెనీలో కొత్త ఉద్యోగులు చేరారని.. అలాంటి వారు ఉద్యోగంలో మెలుకవలు నేర్చుకోవడం, కలిసి పనిచేయడం, వృద్ధి చెందడం, సంస్థలో వర్క్ వెదర్‌ను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని, తాము కంపెనీకి చెందిన వ్యక్తులమే భావన ఉద్యోగుల్లో పెరగానికి ఇది ఉపయోగపడుతుందని టీసీఎస్ ఉద్యోగులకు తెలిపింది.




మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..