APPSC Group -1 Mains: జూన్ 3 నుంచి ఎపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్.. ఈసారి ట్యాబ్‌ల ద్వారా కాకుండా అభ్యర్థుల చేతికే ప్రశ్నపత్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 3 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఎంపిక చేసిన పది జిల్లాల్లోని 11 కేంద్రాల్లో గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. జూన్ 3 నుంచి 10వ తేదీ (4వ తేదీ మినహా) వరకు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 3 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఎంపిక చేసిన పది జిల్లాల్లోని 11 కేంద్రాల్లో గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. జూన్ 3 నుంచి 10వ తేదీ (4వ తేదీ మినహా) వరకు జరుగుతాయని ఆయన తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలలోకి అనుమతిస్తారు. 9:30 గంటలలోగా అభ్యర్థులు తమ గదులకు వెళ్లాలి. ఆ తర్వాత 15 నిమిషాల వరకు లోనికి అనుమతిస్తారు. 9.45 నిమిషాలు దాటితే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించరు.
మెయిన్స్ పరీక్షలు రాసేందుకు దాదాపు 6,455 మంది అర్హత సాధించారన్నారు. గతంలోలా ట్యాబ్‌లలో కాకుండా ఈసారి నేరుగా ప్రశ్నాపత్రాలు చేతికి అందించనున్నట్లు వెల్లడించారు. పరీక్షలు జరిగే తీరును ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి చూసేందుకు వీలుగా ప్రతి ఎగ్జాం సెంటర్‌లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ఈ పరీక్షల ఫలితాలను జులై నెలాఖరుకు ప్రకటించి ఆగస్టులోగా మౌఖిక పరీక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. స
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.