NHAI Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అన్ రిజర్వ్‌డ్ (33), ఎస్సీ (4), ఎస్టీ (1), ఓబీసీ (11), ఈడబ్ల్యూఎస్ (1) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022 (సివిల్ ఇంజినీరింగ్) ఇంటర్వ్యూకు ఎంపిక అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 39,100 జీతంగా అందిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు జూన్ 30ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..