AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Edible Oil Price: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. మరింత తగ్గనున్న వంటనూనె ధరలు!

సామాన్యులకు ఊరటనిస్తూ ప్రభుత్వం గురువారం నుంచి శుద్ధి చేసిన సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్‌లో ఆయిల్ సరఫరాను పెంచేందుకు ఇది ఉపయోగపడనుందని..

Edible Oil Price: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. మరింత తగ్గనున్న వంటనూనె ధరలు!
Edible Oil Price
Subhash Goud
|

Updated on: Jun 15, 2023 | 7:48 PM

Share

సామాన్యులకు ఊరటనిస్తూ ప్రభుత్వం గురువారం నుంచి శుద్ధి చేసిన సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్‌లో ఆయిల్ సరఫరాను పెంచేందుకు ఇది ఉపయోగపడనుందని, దీని కారణంగా ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సాధారణంగా ‘ముడి’ సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెను దేశంలో దిగుమతి చేసుకుంటోంది. తర్వాత అది దేశీయంగా శుద్ధి చేయడం జరుగుతుంది. ఇదిలావుండగా, ప్రభుత్వం శుద్ధి చేసిన సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది.

ఇక దిగుమతి సుంకం తగ్గింపుతో ఇప్పుడు రిఫైన్డ్ ఎడిబుల్ ఆయిల్‌పై దిగుమతి సుంకం 13.7 శాతానికి తగ్గింది. ఇందులో విధించే సెస్ కూడా ఉంటుంది. అదే సమయంలో అన్ని రకాల ముడి ఎడిబుల్ ఆయిల్‌పై సమర్థవంతమైన దిగుమతి సుంకం 5.5 శాతంగా ఉంటుంది. ప్రభుత్వ ఈ చర్యపై సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెహతా మాట్లాడారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌పై తాత్కాలిక ప్రభావం చూపుతుందని, అయితే అంతిమంగా విదేశాల నుంచి రిఫైన్డ్ ఆయిల్ దిగుమతిని ప్రోత్సహిస్తుందని, ఇది దేశీయ ఉత్పత్తిదారులకు నష్టం కలిగిస్తుందని అన్నారు.

అయితే ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించడానికి ప్రధాన కారణం ఎడిబుల్ ఆయిల్స్ ధరలను అదుపులో ఉంచడమేనని వి.మెహతా ఒక ప్రకటనలో తెలిపారు. క్రూడ్, రిఫైన్డ్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకంలో చాలా స్వల్ప వ్యత్యాసం ఉన్నప్పటికీ, శుద్ధి చేసిన ఆయిల్‌ దిగుమతి తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. వాణిజ్యపరంగా ఆచరణాత్మకంగా లేకపోవడమే ఇందుకు కారణమన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం దేశంలో శుద్ధి చేసిన సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతి కావడం లేదు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ చర్య ఖచ్చితంగా మార్కెట్‌ను తాత్కాలికంగా ప్రభావితం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యంగా భారత్‌కు చేరుకుంన్నాయి. దీని కారణంగా నూనె గింజల విత్తడం కూడా ఆలస్యం కావచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి