AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Leasing vs Buying: కారు కొనడం లేదా లీజుకు తీసుకోవడం.. ఇందులో ఏది బెటర్‌

కొత్త కారు కొనుగోలు చేసిన తర్వాత దాని జీవిత కాలం 10-15 సంవత్సరాలు. కారు కొనుగోలు చేసిన తర్వాత సంవత్సరాలు గడుస్తున్నకొద్ది దాని ధర కూడా పడిపోతుంటుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో ప్రతి ఒక్కరూ అప్‌డేట్‌గా..

Car Leasing vs Buying: కారు కొనడం లేదా లీజుకు తీసుకోవడం.. ఇందులో ఏది బెటర్‌
Car Leasing Vs Buying
Subhash Goud
|

Updated on: Jun 15, 2023 | 4:36 PM

Share

కొత్త కారు కొనుగోలు చేసిన తర్వాత దాని జీవిత కాలం 10-15 సంవత్సరాలు. కారు కొనుగోలు చేసిన తర్వాత సంవత్సరాలు గడుస్తున్నకొద్ది దాని ధర కూడా పడిపోతుంటుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో ప్రతి ఒక్కరూ అప్‌డేట్‌గా ఉండాలనుకుంటున్నారు. కాబట్టి, మీకు కొత్త ఫీచర్లు అవసరమైతే కొత్త కారును కొనుగోలు చేయాలి. మీరు కొత్త కారుని తీసుకుని.. మీకు కావలసినప్పుడు ఖర్చు లేకుండా మార్చుకోవడానికి ఏదైనా పరిష్కారం ఉందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. దానికి ఒక పరిష్కారం ఉంది. దాని పేరే కారు లీజింగ్. కారు కొనడమే కాకుండా లీజుకు కూడా తీసుకోవచ్చని తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు కారు లీజింగ్ గురించి వినకపోతే దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

OLX, Quikr Cars, Avis Lease, OLA Car Lease, Uber Car Lease, REVV వంటి అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు మీకు కారును లీజుకు ఇవ్వడంలో సహాయపడతాయి. మన దేశంలో ప్రజలు ఎప్పుడూ పూర్తి మొత్తాన్ని చెల్లించడం ద్వారా లేదా రుణాలు తీసుకోవడం ద్వారా కార్లను కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది కొత్త ఆప్షన్లను ఎంచుకుంటున్నారు. వాటిలో కార్ లీజింగ్ ఒకటి. కారు లీజింగ్ అనేది అద్దెకు తీసుకోవడం లాంటిది. ఇక్కడ మీరు కారును ఉపయోగించుకునే హక్కును పొందుతారు.

కారును కొనుగోలు చేసేటప్పుడు మీరు ముందుగా ఎక్కువ మొత్తంలో డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే లోన్ తీసుకోవడం ద్వారా దానికి వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు నెల నెలా ఆ బాకీ ఈఎంఐ రూపంలో తిరిగి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మీరు కారు మెయింటెనెన్స్ ఖర్చును కూడా భరించాలి. దీనికి విరుద్ధంగా కారు లీజింగ్‌తో మీరు లోన్ ఈఎంఐకి సమానంగా లేదా అంతకంటే తక్కువ నెలవారీ వాయిదాలను చెల్లించడం ద్వారా కారుని పొందవచ్చు. కారు లీజుకు నెలవారీ పేమెంట్స్ ఉంటాయి. అంతే కాదు కారు రిపేర్లు, యాక్సెసరీ రీప్లేస్‌మెంట్‌లతో సహా నిర్వహణ ఖర్చు కూడా ఇందులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మీ కారు పాతది అయినప్పుడు, మీరు దానిని తిరిగి విక్రయించి, ఆపై కొత్త కారును కొనుగోలు చేస్తారు. అదేవిధంగా కారు లీజింగ్ విషయంలో మీరు కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే కొత్త కారుని పొందవచ్చు. అంతేకాకుండా పూర్తి ధర చెల్లించకుండా మీరు ఖరీదైన, ప్రీమియం కార్లను కూడా నడపవచ్చు. కారు మోడల్ కాలవ్యవధి, మైలేజీ వంటి అంశాలపై లీజుకు అయ్యే ఖర్చు ఆధారపడి ఉంటుంది. మీరు కారును కనీసం రెండు నుంచి నాలుగు సంవత్సరాలు, గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు లీజుకు తీసుకోవచ్చు. కొన్ని కంపెనీలు ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు కారు లీజును కూడా అందిస్తాయి.

అయితే, కారు లీజింగ్‌కు మైలేజ్ పరిమితులు ఉంటాయి. మీరు సంవత్సరానికి ఒక నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే కారును నడపగలరని దీని అర్థం. అదనంగా కారును లీజుకు తీసుకోవడానికి మీరు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఈ సెక్యూరిటీ డిపాజిట్ రూ.20,000 నుంచి రూ.30,000 వరకు ఉండవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్ ఖచ్చితమైన మొత్తం ఎక్కువగా అద్దెకు తీసుకున్న కారుపై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా, రూ.4,000 నుంచి రూ.5,000 వరకు చెల్లించాల్సిన వన్-టైమ్ నాన్-రీఫండబుల్ ఛార్జీ కూడా ఉంది. ఈ మొత్తం కూడా కారు మోడల్ ఆధారంగా మారుతుంది.

కారు కొనడం లేదా లీజుకు తీసుకోవడం.. ఇందులో ఏది బెట్టర్‌

మీరు కారును 8 నుంచి 10 సంవత్సరాల వరకు ఎక్కువ కాలం లీజుకు తీసుకోవాలనుకుంటే, మీ స్వంత ఆస్తిని కలిగి ఉండాలని మీరు భావిస్తే, కారును కొనుగోలు చేయడం సరైన ఆప్షన్‌. అయితే మీరు కారును ఆస్తిగా కలిగి ఉండకూడదనుకుంటే తరచుగా కార్లను మార్చడం లేదా మీ ఉద్యోగానికి కొత్త స్థానాలకు తరచుగా బదిలీలు అవసరమైతే, కారును లీజుకు తీసుకోవడం బెటర్ ఆప్షన్‌.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి