AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Cars: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ రెండు కార్ల గురించి అదిరే అప్ డేట్.. లాంచింగ్ ఎప్పుడంటే..

టాటా మోటార్స్ మరో మోడల్ ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టాటా ఆల్ట్రోజ్ ఈవీ ని తీసుకొచ్చేందుకు అంతా సిద్ధం చేస్తోంది. మరోవైపు మారుతి సుజుకీ కూడా ఈవీఎక్స్ పేరిట 2023 ఆటో ఎక్స్ పోలో కొత్త కారును ప్రదర్శించింది. దీనిని 2025నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి.

Electric Cars: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ రెండు కార్ల గురించి అదిరే అప్ డేట్.. లాంచింగ్ ఎప్పుడంటే..
Tata Altroz Ev
Madhu
|

Updated on: Jun 14, 2023 | 6:00 PM

Share

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు తన ముద్ర వేసుకుంటున్నాయి. ప్రపంచంలోని టాప్ బ్రాండ్లు కూడా హై ఎండ్ లగ్జరీ కార్లను ఎలక్ట్రిక్ వేరియంట్లో ఇక్కడ లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే టాటా మోటర్స్ అనేక మోడళ్లను మన దేశంలో లాంచ్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. టాటా మోటార్స్ నుంచి నెక్సాన్ ఈవీ, టైగోర్ ఈవీ, టియోగో ఈవీలను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ క్రమంలో మారుతి సుజుకీ కూడా ఈ సెగ్మెంట్లో తన ముద్ర వేసుకునేందుకు రెడీ అయిపోయింది.

మూడు కార్లను ఇప్పటికే ఇండియా మార్కెట్లో లాంచ్ చేసిన టాటా మోటార్స్ మరో మోడల్ ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టాటా ఆల్ట్రోజ్ ఈవీ ని తీసుకొచ్చేందుకు అంతా సిద్ధం చేస్తోంది. దీనిని 2020 ఆటో ఎక్స్ పోలో తొలిసారి ప్రదర్శించింది. మరోవైపు మారుతి సుజుకీ కూడా ఈవీఎక్స్ పేరిట 2023 ఆటో ఎక్స్ పోలో కొత్త కారును ప్రదర్శించింది. దీనిని 2025నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి.

టాటా అల్ట్రోజ్ ఈవీ..

మన దేశంలో ఎంతో కాలంగా వినియోగదారులు ఎదురుచూస్తున్న మోడల్ ఇది. ఇది దాదాపు ఇప్పటికే ఉన్న సంప్రదాయ ఇంధన మోడల్ కారు డిజైన్ లోనే ఉంటుంది. అయితే కొన్ని స్టైలిష్ ఎలిమెంట్స్ మాత్రం కొత్తగా దీనికి యాడ్ చేశారు. దీనిలో జిప్ ట్రాన్ పవర్ ట్రైన్ ఉంటుంది. పర్మనెంట్ మాగ్నెట్ ఏసీ మోటార్ ద్వార శక్తిని పొందుతుంది. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 300కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం కూడా ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకీ ఈవీఎక్స్..

ఇది టాటా పంచ్ లుక్ లో కనిపిస్తుంది. 2025నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అనువైన ధరలోనే ఉండే అవకాశం ఉంది. దీనిలో 60కిలోవాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 550 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 4,300ఎంఎం పొడవు, 1800ఎంఎం వెడల్పు, 1600 మీటర్ల ఎత్తుతో ఈ వాహనం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?