PNB UPI Payments: సరికొత్తగా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్‌నెట్ లేకుండానే నగదు బదిలీ.. ఎలా సాధ్యం?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూపీఐ లావాదేవీల కోసం సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది. ఆఫ్ లైన్ ఐవీఆర్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో వినియోగదారులు ఇంటర్ నెట్ అవసరం లేకుండానే ఎంచక్కా పేమెంట్స్ చేసేయొచ్చు.
ఇటీవల కాలంలో డిజిటల్ పేమెంట్స్ కి ప్రాధాన్యం పెరిగింది. కరోనా అనంతర పరిణామాల్లో అందరూ యూపీఐ బేస్డ్ పేమెంట్స్ ని అలవాటు చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఫోన్ పే, గూగుల్ పే, పే టీఎం వంటి సంస్థలు యూపీఐ ఆధారిత ప్లాట్ ఫారంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇప్పుడు ఈ మార్కెట్లోకి పలు బ్యాంకులు కూడా ప్రవేశిస్తున్నాయి. దీనిలో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూపీఐ లావాదేవీల కోసం సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది. ఆఫ్ లైన్ ఐవీఆర్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో వినియోగదారులు ఇంటర్ నెట్ అవసరం లేకుండానే ఎంచక్కా పేమెంట్స్ చేసేయొచ్చు. ఈ తరహా సౌకర్యాన్ని తీసుకొచ్చిన మొదటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా పీఎన్బీ నిలిచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
గ్రామీణ భారతమే టార్గెట్..
భారతదేశంలో గ్రామీణ జనాభా ఎక్కువ. అయితే ఆయా గ్రామాల్లో ఇప్పటికే చాలా మంది రోజువారీ అవసరాలకు చేతిలో నగదుపైనే ఆధారపడుతున్నారు. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలలో దాదాపు 63% గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ క్రమలో గ్రామీణులు సులభంగా యూపీఐని వినియోగించేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు పిఎన్‌బి ఎండీ సీఈఓ అతుల్ కుమార్ గోయెల్ ప్రకటించారు. స్మార్ట్‌ఫోన్‌లు లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీకి అంతగాలేని వ్యక్తులకు ఈ విధానం బాగా ఉపకరిస్తుందని చెప్పారు. ఈ కొత్త విధానం పేరు యూపీఐ 123పే(UPI 123PAY) గా పేర్కొన్నారు. దీని ద్వార భారతదేశంలో ఎక్కడి నుండైనా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చని.. ఏదైనా ఒక ఫోన్ ఉన్న వారు వినియోగించవచ్చని వివరించారు.
యూపీఐ 123పే అంటే..
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం, యూపీఐ 123పే అనేది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపు సేవను ఇమ్మీడియెట్ ట్రాన్స్ ఫర్ విధానం ద్వారా ఫీచర్ ఫోన్ వినియోగదారులు సైతం సురక్షితంగా ఉపయోగించుకునే సదుపాయం. దీనిని వినియోగించేందుకు వినియోగదారులకు ఒక నంబర్‌ను డయల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పటి వరకూ మీరు వినియోగిస్తున్న యూపీఐ లైట్ విధానానికి కాస్త భిన్నంగా ఉంటుంది. మీరు యూపీఐ వ్యాలెట్ డబ్బులు ఆన్ లైన్ లో వెసుకొని దానిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తిగా ఆఫ్ లైన్ లో జరుగుతుంది. అలాగే డైరెక్ట్ బ్యాంకు నుంచి లావాదేవీలు జరుగుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..