Aatmanirbhar Bharat: ఆర్మీ కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా.. రక్షణ శాఖతో ఐకామ్ కీలక ఒప్పందం
స్వదేశీ రక్షణ పరికరాల తయారీకి మరింత ఊతమివ్వడానికి, అలాగే ఆత్మనిర్భర్ నినాదాన్ని సాకారం చేసుకోవడమే లక్ష్యంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌కు చెందిన ఐకామ్ ( ICOMM) టెలి లిమిటెడ్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దేశ భద్రత పరిరక్షణలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ 5/7.5 టన్నుల 1035 రేడియో రిలే కమ్యూనికేషన్ పరికరాలను కొనుగోలు చేసేందుకు ఈ ఎంఓయూ చేసుకుంది.
స్వదేశీ రక్షణ పరికరాల తయారీకి మరింత ఊతమివ్వడానికి, అలాగే ఆత్మనిర్భర్ నినాదాన్ని సాకారం చేసుకోవడమే లక్ష్యంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌కు చెందిన ఐకామ్ ( ICOMM) టెలి లిమిటెడ్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దేశ భద్రత పరిరక్షణలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ 5/7.5 టన్నుల 1035 రేడియో రిలే కమ్యూనికేషన్ పరికరాలను కొనుగోలు చేసేందుకు ఈ ఎంఓయూ చేసుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ దాదాపు రూ.500 కోట్లు. రేడియో రిలే కంటైనర్‌లు ఇండియన్ ఆర్మీ మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి. కమ్యూనికేషన్ పరికరాలు మరింత సమర్థంగా పనిచేయడానికి ఈ కంటైనర్లు ఉపయోగపడతాయి. ఇది స్వదేశీ రక్షణ పరికరాల తయారీకి మరింత ఊపునిస్తుంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో తోడ్పడుతుంది. అలాగే దేశ రక్షణలో ప్రైవేట్ రంగానికి మరింత ప్రోత్సహం అందించినట్లవుతుంది. ఇక ఇటువంటి అత్యాధునిక పరికరాల అభివృద్ధి స్నేహపూర్వక దేశాలకు ఎగుమతులను పెంచడంలో కూడా సహాయపడతాయి.
ఇక ICOMM అనేది హైదరాబాద్ కేంద్రంగా నడిచే మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ కంపెనీ. ఇది భారతదేశంలోని అతిపెద్ద మౌలిక సదుపాయాల కంపెనీలలో ఒకటి. దేశ రక్షణ, భద్రతా రంగాలకు అవసరమైన ఆయుధాల తయారీలో భాగస్వామిగా ఉంటోంది. . 1989లో కార్యకలాపాలు ప్రారంభించిన ICOMM, రక్షణ, శక్తి, టెలికాం, సౌర రంగాలకు సంబంధించి ఉత్పత్తుల పరికరాలు, ఆయుధాల తయారీలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అలాగే డిఫెన్స్, ఏరోస్పేస్, పవర్, రోడ్లు, ఆయిల్, గ్యాస్, టెలికాం రంగాల్లోనూ సేవలందిస్తోంది.నాణ్యత, ఆవిష్కరణ, అభివృద్ధి అనే మూల సూత్రాలకు కట్టుబడి పనిచేస్తోన్న ఐకామ్ వార్షిక టర్నోవర్ 4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..