AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ వార్తలపై స్పందించిన జబర్దస్త్‌ హరికృష్ణ.. నా ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ..

మవారం (జూన్ 12) వైఎస్‌ హరిబాబుపై మరో స్మగ్లింగ్‌ కేసు నమోదైంది. దీంతో హరిబాబు పేరు మరొకసారి తెరపైకి వచ్చింది.  ఈ విషయంపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే కొన్ని మీడియా సంస్థలు హరిబాబు బదులు జబర్దస్త్‌లో లేడీ గెటప్పులు వేస్తున్న గంపా హరికృష్ణ ఫొటోలను ప్రచురితం చేశాయి.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ వార్తలపై స్పందించిన జబర్దస్త్‌ హరికృష్ణ.. నా ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ..
Jabardasth Harikrishna
Basha Shek
|

Updated on: Jun 13, 2023 | 1:36 PM

Share

ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కేసులో ప్రముఖ టీవీ షో జబర్దస్త్‌ కమెడియన్‌ హరిబాబుపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితమే తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కేసులు అతనిపై నమోదయయ్యాయి. అయితే హరిబాబు మాత్రం పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నాడు. కొన్నేళ్లుగా పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. సోమవారం (జూన్ 12) వైఎస్‌ హరిబాబుపై మరో స్మగ్లింగ్‌ కేసు నమోదైంది. దీంతో హరిబాబు పేరు మరొకసారి తెరపైకి వచ్చింది.  ఈ విషయంపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే కొన్ని మీడియా సంస్థలు హరిబాబు బదులు జబర్దస్త్‌లో లేడీ గెటప్పులు వేస్తున్న గంపా హరికృష్ణ ఫొటోలను ప్రచురితం చేశాయి. సోషల్‌ మీడియాలో జబర్దస్త్‌ కమెడియన్‌ను ట్రోల్‌ చేస్తూ పోస్టులు దర్శనమిచ్చాయి. దీంతో గంపా హరికృష్ణ స్పందించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో ఇరుక్కుంది తాను కాదంటూ మొర్రో అంటూ క్లారిటీ ఇచ్చాడు.

‘ స్మగ్లింగ్‌ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. 2013లో షకలక శంకర్‌ టీమ్‌లో వైఎస్‌ హరిబాబు పని చేశాడు. ఆ తర్వాత అతను ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. పోలీసుల విచారణలో అతను జబర్దస్త్‌ కామెడీ షోలో చేసినట్లు కూడా తేలింది. అప్పటికి నేను కూడా కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. అయితే ఇప్పుడు గూగుల్‌లో జబర్దస్త్‌ హరి పేరు కొడితే నా ఫొటోలు దర్శనమిస్తున్నాయి. దీంతో కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌ సైట్లు నా ఫొటోలతో స్మగ్లింగ్‌ వార్తలు ప్రచురితం చేశాయి. దీని వల్ల నేను చాలా సఫర్‌ అవుతున్నాను’ అని చెప్పుకొచ్చారు జబర్దస్త్‌ హరి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!