Cyclone Biparjoy: తీరాన్ని తాకిన తుపాను.. గుజరాత్‌లో పెను విధ్వంసం..
పశ్చిమ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన బిపర్‌జోయ్ తుపాను గుజరాత్ తీరాన్ని తాకింది. బిపర్‌జోయ్ తుపాను గుజరాత్ తీరంలో పెను విధ్వంసం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి వరకు తుపాను ల్యాండ్ ఫాల్ కొనసాగనుంది. బిపర్‌జోయ్ ప్రభావంతో..
పశ్చిమ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన బిపర్‌జోయ్ తుపాను గుజరాత్ తీరాన్ని తాకింది. బిపర్‌జోయ్ తుపాను గుజరాత్ తీరంలో పెను విధ్వంసం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి వరకు తుపాను ల్యాండ్ ఫాల్ కొనసాగనుంది. బిపర్‌జోయ్ ప్రభావంతో.. కచ్, ద్వారక, సౌరాష్ట్ర ప్రాంతాల్లో భారీ నష్టం చోటు చేసుకుంది. ద్వారకలో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. గాలి తీవ్రతతో చెట్లు, కరెంట్ స్తంభాలు కుప్పకూలాయి. కచ్ ప్రాంతంలో కరెంట్ పూర్తిగా నిలిపివేశారు. గుజరాత్ తీర ప్రాంతాలపై బిపర్‌జోయ్ తీవ్ర ప్రభావం చూపుతుంది. తీర ప్రాంతంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. లోతట్లు ప్రాంతాల ప్రజలు, తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భారీ వర్షాలు..
బిపర్‌జోయ్ ప్రభావంతో గుజరాత్‌లోని ద్వారక, జామ్‌నగర్, పోర్‌బందర్, మోర్బి, రాజ్‌కోట్, జునాగఢ్, ఆమ్రేలి, భావ్‌నగర్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 18 ఎన్డీఆర్‌ఎఫ్, 12ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు రోడ్లు భవనాలశాఖకు చెందిన 115 బృందాలు, విద్యుత్‌శాఖకు చెందిన 397 బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ కోస్ట్‌గార్డ్ దళాలను కూడా అప్రమత్తం చేశారు.
రైళ్లు రద్దు..
ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పశ్చిమ రైల్వే 76 రైళ్లను రద్దు చేసింది. ద్వారకా, సోమనాథ్ ఆలయాలను గురువారం వరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు.
మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..