OMG: స్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఇంతలో శవపేటిక నుంచి భారీ శబ్ధాలు.. ఓపెన్ చేయగా షాక్..!
ఓ మహిళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. శోకసంద్రంలోనే ఆమె శవపేటికను స్మశాన వాటికకు తరలించారు. ఇంతలో శవపేటిక పేటిక నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చాయి. దాంతో మొదట వారంతా హడలిపోయారు. ఆ తరువాత ధైర్యం చేసుకుని శవపేటికను ఓపెన్ చేయగా
ఓ మహిళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. శోకసంద్రంలోనే ఆమె శవపేటికను స్మశాన వాటికకు తరలించారు. ఇంతలో శవపేటిక పేటిక నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చాయి. దాంతో మొదట వారంతా హడలిపోయారు. ఆ తరువాత ధైర్యం చేసుకుని శవపేటికను ఓపెన్ చేయగా షాకింగ్ సీన్ కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయి చూశారు. ఇంతీక అక్కడ ఏం జరిగింది.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈక్వెడార్‌లోని బాబాహోయెల్‌కు చెందిన 76 ఏళ్ల బెల్లా మోంటోయా గుండె పోటుతో కుప్పకూలిపోయింది. దాంతో అంతా ఆమె చనిపోయారని భావించారు. ఆమె శరీరాన్ని శవపేటికలో పెట్టారు. ఓవైపు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తుండగా.. మరోవైపు ఆ మహిళ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, ఇంతలోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మూసివేసిన శవపేటిక నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చాయి. ఎవరో మాట్లాడుతున్నట్లుగా వినిపించింది. దాంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. వెంటనే ఆ శవపేటికను ఓపెన్ చేశారు. చనిపోయిందనుకున్న మహిళ.. తాను బ్రతికే ఉన్నానంటూ పైకి లేచింది. దాంతో అక్కడి వారంతా హడలిపోయారు. కాసేపటికి తేరుకుని, ఇది నిజంగా దేవుడి మహిమ అంటూ చర్చించుకున్నారు. వైద్యులే చనిపోయిందని ప్రకటించారు. ఆమేరకు మరణ ధృవీకరణ పత్రం కూడా జారీ చేశారు. ఇంతలో ఆమె బ్రతికి రావడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కార్డియోస్పిరేటరీ అరెస్ట్‌తో మరణించిన మహిళ.. కొన్ని గంటల తరువాత మళ్లీ బ్రతకడం సంచలనం సృష్టిస్తుంది. అయితే, ఈ వ్యవహారాన్ని ఈక్వెడార్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇది వైద్యుల తప్పిదమా? లేక మిరాకిల్ ఆ? అని తేల్చేందుకు ఒక దర్యాప్తు బృందాన్ని నియమించింది.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..