Sun Transit 2023: మిథునరాశిలో సూర్యుని సంచారం.. ఈ 4 రాశుల వారు ఆర్థికంగా ఫుల్ జోష్‌లో ఉంటారు..!

Surya Gochar 2023: జూన్ 15వ తేదీన సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి స్థాన చలనం కారణంగా.. పలు రాశుల వారిపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సూర్యడుని ఆత్మకారకం అంటారు.

Sun Transit 2023: మిథునరాశిలో సూర్యుని సంచారం.. ఈ 4 రాశుల వారు ఆర్థికంగా ఫుల్ జోష్‌లో ఉంటారు..!
Sun Transit
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 12, 2023 | 2:05 PM

Surya Gochar 2023: జూన్ 15వ తేదీన సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి స్థాన చలనం కారణంగా.. పలు రాశుల వారిపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సూర్యడుని ఆత్మకారకం అంటారు. జూన్ 15న సాయంత్రం 6.07 గంటలకు సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. దాని ప్రభావంతో 4 రాశుల వారు విశేష ప్రయోజనాలు పొందబోతున్నారు. మరి అదృష్టం వరించనున్న ఆ నాలుగు రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మేషరాశి..

సూర్యుని సంచారము మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మేషరాశి వారికి ధైర్యసాహసాలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగం, పరిపాలనాపరమైన అంశాల్లో ఉన్న వారికి గౌరవం పెరుగుతుంది. ఆర్థిక లాభం చేకూరుతుంది. పరిపాలనా, నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ఈ సమయంలో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే లాభం ఉంటుంది.

సింహ రాశి..

సింహరాశి వారికి సూర్యుడు అధిపతి. సూర్యుని స్థానచలనం అనేక విషయాలలో వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశిచక్రంలోని వ్యక్తులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. పని చేసే చోట ప్రమోషన్ పొందే అవకాశాలు ఉంటాయి. సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది. సంబంధాలు మెరుగుపడుతాయి. గౌరవనీయమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలను పొందే ఛాన్స్ ఉంది. కోరికలన్నీ తీరుతాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో ప్రయోజనాలు పొందుతారు.

ఇవి కూడా చదవండి

కన్యా రాశి..

కన్యా రాశి వారికి సూర్యడి స్థాన చలనం.. ఉద్యోగ రీత్యా విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయం అన్ని అంశాల్లో సానుకూలంగా ఉంటుంది. విదేశాల్లో స్థిరపడే అవకాశం కూడా లభిస్తుంది. ఈ సమయంలో, విదేశీ పరిచయాలు, మీరు పని చేసే ప్రాంతంలో ప్రయోజనం చేకూరుతాయి. కొత్త బాధ్యతలు అందుకుంటారు. కెరీర్ ప్రయోజనకరంగా ఉంటుంది.

కుంభ రాశి..

సూర్యుని సంచారంతో ఈ రాశి వారు సృజనాత్మక రంగంలో ముందుకు సాగుతారు. ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరు చేపట్టే ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. వ్యాపారంలో కొత్త ఆలోచనలతో దూసుకుపోతారు.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు మత గ్రంధాలు, జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!