Healthy Lungs: ఊపిరితిత్తులను డిటాక్స్ చేయడానికి ఈ 6 ఆహారాలు ఉత్తమమైనవి.. వివరాలివే..

Healthy Lungs: శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే ఊపిరితిత్తులు కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి శరీరంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాలుష్యం, ధూమపానం, సరికాని జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం మొదలైనవి ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. ఊపిరితిత్తులలో టాక్సిన్స్ పేరుకుపోతాయి.

Healthy Lungs: ఊపిరితిత్తులను డిటాక్స్ చేయడానికి ఈ 6 ఆహారాలు ఉత్తమమైనవి.. వివరాలివే..
Lungs Detox
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 11, 2023 | 9:40 PM

Healthy Lungs: శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే ఊపిరితిత్తులు కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి శరీరంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాలుష్యం, ధూమపానం, సరికాని జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం మొదలైనవి ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. ఊపిరితిత్తులలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. దీనివల్ల దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఊపిరితిత్తులను డిటాక్స్ చేయడానికి ప్రతిరోజూ కొన్ని ఆహార పదార్థాలు తినాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడతాయంటున్నారు. మరి ఆ ఆహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

క్వినోవా సలాడ్..

ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం క్వినోవా సలాడ్ తినవచ్చు. క్వినోవా, గ్రీన్ వెజిటేబుల్స్, టొమాటోలు, దోసకాయ, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, అవకాడో కలపడం ద్వారా క్వినోవా సలాడ్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ సలాడ్ తినడం వలన ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.

వోట్స్, బెర్రీలు..

పాలు, నీటి సహాయంతో ఓట్స్ వంటకం చేసుకుని తినొచ్చు. బెర్రీలతో కలిపి కూడా ఓట్స్ తినొచ్చు. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలను కలిపి తీసుకోవడం ద్వారా శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. ఓట్స్, బెర్రీలు ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

ఆకు కూరలతో స్మూతీ..

బచ్చలికూర, దోసకాయ, ఆపిల్, నిమ్మకాయలతో కలిపి స్మూతీలు చేసుకోవచ్చు. ఈ స్మూతీ చాలా రిఫ్రెష్‌గా ఉంటుంది. ఇది డిటాక్సిఫైయింగ్ డ్రింక్ లాగా పనిచేస్తుంది.

పప్పు, కూరగాయల సూప్..

కాయధాన్యాలు, కూరగాయలను ఉపయోగించి సూప్ సిద్ధం చేయవచ్చు. సూప్ చేయడానికి క్యారెట్, ఉల్లిపాయలు, పసుపు, అల్లం, కొత్తిమీర మొదలైనవి అవసరం. ఇవి ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తాయి.

టోఫు..

టోఫు, కూరగాయలు తినవచ్చు. బ్రోకలీ, క్యాప్సికం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సోయా పాలను ఉపయోగించి టోఫును తయారు చేస్తారు. టోఫు, కూరగాయలు కలిపి సలాడ్ మాదిరిగా తీసుకోవచ్చు. ఇది ఊపిరితిత్తులను డిటాక్స్ చేస్తుంది.

నిమ్మరసం..

ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. దానికి నిమ్మరసం కలపాలి. నిమ్మకాయ నీటి ఉదయాన్నే తాగాలి. ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఊపిరితిత్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

(గమనిక: పై వార్తలో అందించిన సమాచారం సాధారణ ప్రయోజనాలను ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వారి సలహా మేరకు అవసరమైన చిట్కాలు పాటించడం చేయాలి.)

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..