Hygiene Habits: శృంగారమే కాదు.. ఈ పనులు తప్పక చేయాల్సిందే.. లేదంటే జీవితాంతం ఇబ్బంది పడతారు..!

శృంగారంలో పాల్గొనడం ముఖ్యమే కానీ, కొన్ని లైంగిక పరిశుభద్రత అలవాట్లను అనుసరించడం కూడా చాలా ముఖ్యం. తద్వారా లైంగికంగా సంక్రమించే వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే.. వ్యాధుల బారిన పడి జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సురక్షితమైన శృంగార జీవితాన్ని..

Hygiene Habits: శృంగారమే కాదు.. ఈ పనులు తప్పక చేయాల్సిందే.. లేదంటే జీవితాంతం ఇబ్బంది పడతారు..!
Health
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 10, 2023 | 9:45 PM

శృంగారంలో పాల్గొనడం ముఖ్యమే కానీ, కొన్ని లైంగిక పరిశుభద్రత అలవాట్లను అనుసరించడం కూడా చాలా ముఖ్యం. తద్వారా లైంగికంగా సంక్రమించే వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే.. వ్యాధుల బారిన పడి జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సురక్షితమైన శృంగార జీవితాన్ని ఆస్వాధించడానికి ఎలాంటి లైంగిక పరిశుభ్రతను పాటించాలి? ఎలాంటి అలవాట్లను అలవరుచుకోవాలి? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1) మహిళలు జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటితో శుభ్రపరుచుకోవాలి. మలద్వారం నుంచి యోనిలోకి బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. ఫలితంగా ఈస్ట్ ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. ఈ సమస్యను నివారించడానికి జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి.

2) సున్తీ చేయని పురుషులు.. తమ పురుషాంగం ముందరి చర్మాన్ని వెనక్కి లాగి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. బాక్టీరియా, మృతకణాలు, శరీర ద్రవాలకు అనువుగా ఉండే ఈ ముందరి చర్మం ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

3) జననేంద్రియాలకు క్రిములు, బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి భాగస్వాములిద్దరూ శృంగారానికి ముందు.. తరువాత జననేంద్రియాలు, చేతులు, గోళ్లను కడుక్కోవాలి.

4) ప్రైవేట్ భాగాలలో హెయిర్‌ను కట్ చేసుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో, వేడి, చెమట వల్ల కురుపులు, చర్మ సమస్యలు వస్తాయి.

5) ఇబ్బంది, దుర్వాసనను నివారించడానికి.. మహిళలు వారి ఋతు చక్రం తరువాత మొదటి రెండు రోజులలో శృంగారంలో పాల్గొనకూడదు.

6) మీ భాగస్వామికి నోటి చుట్టూ లేదా జననాంగాల దగ్గర పుండ్లు జాగ్రత్త వహించాలి. ఆ ప్రాంతాలలో నోటితో కిస్ చేయడం వంటి చర్యలకు పాల్పడొద్దు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..