- Telugu News Photo Gallery Skin Care Tips: If you also apply Multani clay on your face be careful This may harm your's face skin
Skin Care Tips: ముల్తానీ మట్టిని ముఖానికి రాస్తున్నారా? బీకేర్‌ఫుల్ ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఉంది..!
అందాన్ని మరింత రెట్టింపు చేయడంలో ముల్తానీ మట్టి సమర్థవంతంగా, సురక్షితంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. అయితే, ఇది అందాన్ని పెంచడమే కాదు.. కొన్ని సందర్భాల్లో చర్మానికి హానీ తలపెడుతుందని చెబుతున్నారు నిపుణులు. ముల్తానీ మట్టిని సరిగా వాడకపోతే.. చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతాయని వార్నింగ్ ఇస్తున్నారు. మరి దీని దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Updated on: Jun 08, 2023 | 4:00 PM

ప్రతి ఒక్కరూ తమ ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలను చేస్తారు. చాలా మంది ముల్తానీ మట్టిని అప్లై చేస్తుంటారు. దీని వల్ల ముఖంలో డల్‌నెస్ తొలగిపోవడమే కాకుండా, మొటిమలు తగ్గుముఖం పడుతాయి. అలాగే ముఖంలో మెరుపు కూడా వస్తుంది. అయితే, దానిని సరిగా వినియోగించకపోతే.. చర్మ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

సున్నితమైన చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టి వాడకాన్ని తగ్గించాలి. ముల్తానీ మట్టిని ఎక్కువగా వాడితే ముఖంపై డల్‌నెస్, దద్దుర్లు వస్తాయి.

పొడి చర్మం కలిగిన వ్యక్తులు ముల్తానీ మట్టిని వాడకూడదు. దీని వల్ల వారి చర్మం మరింత పొడిగా మారుతుంది. చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది.

జలుబు, దగ్గుతో బాధపడేవారు సైతం ముల్తానీ మట్టిని వాడకూడదు. ముల్తానీ మట్టి చల్లటి స్వభావం వల్ల జలుబు, దగ్గు సమస్య మరింత పెరుగుతుంది.

ముల్తానీ మట్టిని క్రమం తప్పకుండా ఉపయోగించే వ్యక్తుల ముఖంపై ముడతలు వచ్చే అవకాశం ఉంది.




