Fact Check: రేపటి నుంచి సెక్స్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం? అసలు నిజం ఇదే..!
Sex Championship: స్వీడన్ దేశంలో సెక్స్‌ను ఒక గేమ్‌గా గుర్తించిందని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కేటరిగీ ఏర్పాటు చేసి టోర్నమెంట్‌ను నిర్వహిస్తోందంటూ ఇంటర్నెట్ మొత్తం సెన్సేషన్ క్రియేట్ అయ్యింది. అయితే, ఇది నిజమా? కాదా? అనేది ఎవరూ ఆలోచించకుండానే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. మరి నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 08, 2023 | 3:21 PM

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక వార్తా సంస్థలు ఇటీవల ‘యూరోపియన్ సెక్స్ ఛాంపియన్‌షిప్‌కు స్వీడన్ ఆతిథ్యం ఇవ్వనుంది’ అనే శీర్షికన పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేశాయి. స్వీడన్ సెక్స్‌ను ఒక అధికారిక క్రీడగా గుర్తించిందని, అందులో ఎవరు బెస్ట్ అని నిర్ణయించేందుకు ఏకంగా టోర్నమెంట్ నిర్వహిస్తోందంటూ ప్రకటన సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యింది. పోటీదారులు ఆరు గంటల వరకు జరిగే రోజువారీ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక గ్రీక్ పోర్టల్.. టోర్నమెంట్‌లో గ్రీక్ పోటీదారుల భాగస్వామ్యాన్ని కూడా ప్రస్తావించింది. ఒక ప్రసిద్ధ దక్షిణాఫ్రికా మీడియా హౌస్, నైజీరియన్ వెబ్‌సైట్ కూడా ఈ కథనాన్ని పబ్లిష్ చేశాయి. ఈ వార్తతో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు షాక్ అయ్యారు. కొంతమంది ఇదేం ఖర్మరా బాబూ అని కూడా ఫీలయ్యారు.

స్వీడన్ అధికారికంగా సెక్స్‌ను ఒక క్రీడగా గుర్తించిందని, ఈ వారం జూన్ 8న మొదటి సెక్స్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తను స్వీడిష్ స్పోర్ట్స్ బాడీ ఖండించింది. తాము అలాంటి టోర్నమెంట్ ఏదీ నిర్వహించడం లేదని క్లారిటీ ఇచ్చింది.

సెక్స్ ఛాంపియన్‌షిప్ వార్తలు అవాస్తవమని ఫ్యాక్ట్ చెక్ నిరూపించింది. స్వీడిష్ స్పోర్ట్స్ కాన్ఫెడరేషన్ ప్రతినిధి అన్నా సెట్జ్‌మాన్ స్టాక్‌హోమ్‌లో ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఈ సమాచారం అంతా తప్పు, స్వీడన్, స్వీడిష్ క్రీడల గురించి కొన్ని అంతర్జాతీయ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం జరుగుతోంది.’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

సెక్స్ ఛాంపియన్‌షిప్ వార్తలు అవాస్తవమని ఫ్యాక్ట్ చెక్ నిరూపించింది. స్వీడిష్ స్పోర్ట్స్ కాన్ఫెడరేషన్ ప్రతినిధి అన్నా సెట్జ్‌మాన్ స్టాక్‌హోమ్‌లో ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఈ సమాచారం అంతా తప్పు, స్వీడన్, స్వీడిష్ క్రీడల గురించి కొన్ని అంతర్జాతీయ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం జరుగుతోంది.’ అని ప్రకటనలో పేర్కొన్నారు.




