- Telugu News Photo Gallery Cinema photos Actress Bhavana is back in kollywood after 13 years telugu cinema news
Bhavana: మరోసారి వెండితెరపై సందడి చేయనున్న అందాల తార.. 13ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న భావన..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు భావన. మహాత్మ సినిమాతో కథానాయికగా పరిచయమైన ఆమె.. తొలి చిత్రానికి నటిగా ప్రశంసలు అందుకుంది. 16 ఏళ్లకే మలయాళి చిత్రం నమ్మాళ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన భావన. తొలి సినిమాకు మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు.
Updated on: Jun 08, 2023 | 1:35 PM

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు భావన. మహాత్మ సినిమాతో కథానాయికగా పరిచయమైన ఆమె.. తొలి చిత్రానికి నటిగా ప్రశంసలు అందుకుంది.

16 ఏళ్లకే మలయాళి చిత్రం నమ్మాళ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన భావన. తొలి సినిమాకు మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు.

తమిళంలో అజిత్, మాధవన్, జయం రవి, భరత్, జీవా వంటి హీరోల సరసన నటించి మెప్పించారు. 2010లో పునీత్ రాజ్ కుమార్ సరనస జాకీ చిత్రంలో నటించారు.

ఇదిలా ఉంటే చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న భావన.. దాదాపు 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. ది డోర్ అనే హర్రర్ చిత్రంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

భావన నటించిన చిత్రం ది డోర్‌కి ఆమె సోదరుడు జైదేవ్ దర్శకత్వం వహించారు. భావన భర్త నవీన్ రాజన్ తన జూన్‌డ్రీమ్స్ స్టూడియోస్ ద్వారా నిర్మించారు.

తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా ది డోర్‌ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ది డోర్ భావన కుటుంబ కథా చిత్రం. భావన నటించిన ఆమె సోదరుడు జైదేవ్ దర్శకత్వంలో ఆమె భర్త నవీన్ నిర్మించిన చిత్రం పలు భాషల్లో విడుదల కానుండడం గమనార్హం.

మరోసారి వెండితెరపై సందడి చేయనున్న అందాల తార.. 13ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న భావన..

మరోసారి వెండితెరపై సందడి చేయనున్న అందాల తార.. 13ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న భావన..




