AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success: ఈ నలుగురు వ్యక్తుల తిట్లు దీవెనలా పని చేస్తాయి.. ప్రేమతో స్వీకరిస్తే జీవితంలో తప్పక సక్సెస్ అవుతారు..!

మనల్ని ఎవరైనా అవమానిస్తే మన రక్తం ఉడికిపోతుంది. వారిని దూషించడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలా? లేక అవమానానికి ప్రతీకారంగా మరేదైనా చేయాలా? అని ఆలోచిస్తాం. అయితే జీవితంలో కొందరికి అవమానాలు తప్పవు. దుర్భాషలు, అవమానాలు..

Success: ఈ నలుగురు వ్యక్తుల తిట్లు దీవెనలా పని చేస్తాయి.. ప్రేమతో స్వీకరిస్తే జీవితంలో తప్పక సక్సెస్ అవుతారు..!
Success Life
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 08, 2023 | 6:21 PM

మనల్ని ఎవరైనా అవమానిస్తే మన రక్తం ఉడికిపోతుంది. వారిని దూషించడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలా? లేక అవమానానికి ప్రతీకారంగా మరేదైనా చేయాలా? అని ఆలోచిస్తాం. అయితే జీవితంలో కొందరికి అవమానాలు తప్పవు. దుర్భాషలు, అవమానాలు.. సదరు వ్యక్తులలో మరింత కసిని రేపుతాయి. అయితే, శివపురాణం ప్రకారం.. అవమానాలను భరించే వారిని అదృష్టం, సక్సెస్ వరిస్తుందట. వారి జీవితం పూర్తిగా మారిపోతుందట. పరుషమైన మాటలు, అవమానాలను ఆశీర్వాదాలుగా భావించి.. వాటిని తమ ఉన్నతమైన జీవితానికి మెట్లుగా మార్చుకుని ఎదుగుతారట. మరి అవమానాలను, తిట్లను పట్టించుకోకుండా, జీవితంలో సక్సెస్ కోసం ప్రయత్నించే వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

తల్లి కోపం..

అమ్మ మిమ్మల్ని తిట్టినా లేదా పరుషమైన మాటలు మాట్లాడినా వాటిని అవమానంగా భావించకూడదు. వాళ్ళ తిట్లలోనూ మంచి ఉంది. అందుకే వారి మాటలను, తిట్లను సంతోషంగా స్వీకరించాలి. వాటిని అనుసరించి, తిట్టడానికి గల కారణాలను గుర్తించాలి. ఇలా చేయడం వల్ల తల్లి ఆశీర్వాదంతో పాటు.. దేవుడు ఆశీర్వాదం కూడా పొందుతారు. తద్వారా జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం వస్తుంది.

తండ్రి మందలింపు..

తండ్రి హోదా భగవంతుని కంటే ఉన్నతంగా పరిగణించబడుతుంది. కోపంతో వారు అన్న మాటలను అవమానంగా భావించవద్దు. బదులుగా.. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంగా భావించాలి. వారి ఒక్కో మాటను ఒక్కో ఛాలెంజ్‌గా తీసుకుని, జీవితంలో ఎదిగేందుకు ప్రయత్నించాలి.

ఇవి కూడా చదవండి

టీచర్ తిట్టడం..

ఉపాధ్యాయులే విజయానికి సోపానాలు. నిష్కళంకమైన గురువు అందించిన విద్య, నేర్పిన జీవిత పాఠాలు మిమ్మల్ని భవిష్యత్‌కు సిద్ధం చేస్తాయి. జీవితంలో రాబోయే కష్టనష్టాలను ఎదుర్కొనేందుకు శక్తినిస్తాయి. మీరు చేసే తప్పులకు ఉపాధ్యాయులు తిట్టడం, కొట్టడం సహజం. అయితే, గురువుల మాటల, దెబ్బలను అవమానంగా భావించొద్దు. దీవెనగా భావించి ముందుకెళ్లాలి.

ఆలయంలో వివక్ష..

దర్శనం కోసం దేవుడి గుడికి వెళ్లి, అక్కడ ఎవరైనా మిమ్మల్ని దూషించడం, వివక్ష చూపడం చేస్తే.. లైట్ తీసుకోవాలి. ఆ పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కోవాలి. కోపం ఎప్పటికీ మేలు చేయదు. గుడిలో ఎంతటి కఠినమైన మాటలనైనా.. సున్నితంగా స్వీకరించాలి. ఆ మాటలను పట్టించుకోకుండా ఉండాలి. వారు తిట్టే ప్రతి మాటకు.. భగవంతుడిని నుంచి ప్రతిస్పందనగా ఆశీర్వాదాలు అందుతాయి.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం.. మత గ్రంధాల్లోని సమాచారం, ప్రజల విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..