Women Health: పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత స్త్రీలు ఈ పని చేయాలి.. లేదంటే క్యాన్సర్ బారిన పడే ఛాన్స్ ఉంది..!
మహిళలు 45, 50 సంవత్సరాల మధ్య రుతువిరతిలో ఉంటారు. మెనోపాజ్ అంటే మహిళల్లో పీరియడ్స్ ఆగిపోవడం. పీరియడ్స్ రావడం ప్రతి స్త్రీ, అమ్మాయి ఆరోగ్యకరమైన జీవనశైలికి సూచిక అయినట్లే, అదే విధంగా సరైన సమయంలో పీరియడ్స్ ఆగిపోవడం కూడా వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారని సూచిస్తుంది.
మహిళలు 45, 50 సంవత్సరాల మధ్య రుతువిరతిలో ఉంటారు. మెనోపాజ్ అంటే మహిళల్లో పీరియడ్స్ ఆగిపోవడం. పీరియడ్స్ రావడం ప్రతి స్త్రీ, అమ్మాయి ఆరోగ్యకరమైన జీవనశైలికి సూచిక అయినట్లే, అదే విధంగా సరైన సమయంలో పీరియడ్స్ ఆగిపోవడం కూడా వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారని సూచిస్తుంది. అయితే వీటన్నింటిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రతి స్త్రీ పీరియడ్స్ ఆగిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పీరియడ్స్ ఆగిపోయినప్పుడు.. శరీరం లోపల అనేక హార్మోన్ల హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆ సమయంలో ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపకుండా ఎలా ఆరోగ్యంగా ఉండాలి? ఏం చేయాలనేది అవగాహన కలిగి ఉండాలి. మరి మోనోపాజ్ సమయంలో స్త్రీలు ఏం చేయాలి? వైద్యులు ఏమంటున్నారు? వివరాలు తెలుసుకుందాం.
వైద్య పరిశీలన..
పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వెంటనే ఆస్పత్రికి పరిగెత్తడం, మళ్లీ మళ్లీ మందులు తీసుకోవడం కాకుండా.. జీవనశైలిని మెరుగుపరుచుకోవాలి. మీ శరీరంలో మార్పులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి సమస్యా ఉండదు.
ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ..
పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అంటే మెనోపాజ్ తర్వాత మహిళలు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆహారంలో మరింత ఎక్కువ ఆరోగ్యకరమైన పదార్థాలు తీసుకోవాలి. పీచు పదార్థాలు, కాల్షియం ఎక్కువగా ఉండే వాటిని తినాలి. 30 ఏళ్ల తర్వాత మహిళల్లో ఎముకలు బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలో ఆకు కూరలు, పండ్లు తప్పనిసరిగా తినాలి. అలాగే ఉప్పు, సోడియం తక్కువగా తినాలి.
కాల్షియం ఫుడ్ తీసుకోవాలి..
మెనోపాజ్ తర్వాత, ఆహారంలో కాల్షియం పదార్థాలు అధికంగా తినాలి. మెనోపాజ్ సమయంలో కాల్షియం చాలా ముఖ్యం. తద్వారా ఎముకలు బలహీనపడవు. అందుకే పాలు, పెరుగు, గుడ్డు, చేపలు ఎక్కువగా తినాలి.
వ్యాయామం, యోగా కోసం సమయాన్ని కేటాయించాలి..
చాలా మంది గృహిణులు తమ ఆరోగ్యం కోసం తగినంత సమయాన్ని వెచ్చించలేరు. కానీ మెనోపాజ్ తర్వాత ఏదో ఒకవిధంగా సమయాన్ని వెచ్చిస్తూ వ్యాయామం చేయాలి. చాలా ఉపశమనం కలిగిస్తుంది. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మంచి ఆరోగ్యానికి ధ్యానం, యోగా కీలకం. ఇది మీ ఒత్తిడిని దూరం చేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
మెనోపాజ్ తర్వాత అండాశయ క్యాన్సర్ ప్రమాదం..
అండాశయ క్యాన్సర్ స్త్రీల అండాశయాలలో మొదలై తర్వాత శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. అండాశయ క్యాన్సర్ ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు. ఈ వ్యాధి 50 సంవత్సరాల మహిళల్లో చాలా సాధారణం. ‘అమెరికన్ క్యాన్సర్ సొసైటీ’ ప్రకారం, అండాశయ క్యాన్సర్ కేసులలో సగం 63 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో కనుగొనడం జరిగింది. అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మెనోపాజ్ వయస్సులో మాత్రమే పెరుగుతుంది.
నిరాకరణ: ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలు, సూచనలను అనుసరించే ముందు.. డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోవాలి. దీనిని టీవీ9 తెలుగు నిర్ధారించడం లేదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..