AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని నిల్వ చేయడం క్షేమమేనా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు..!

నేటి ఆధునిక జీవనశైలిలో.. మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయడం పరిపాటిగా మారింది. ఆఫీసుల్లో పని చేసే వారు మరుసటి రోజు వారికి టైమ్ సేవ్ అయ్యేలా, బాక్స్ కోసం ఎక్కువ ఆహారాన్ని వండుతారు. అయితే, మిగిలిపోయిన ఆహారాన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టి ఫ్రిజ్‌లో భద్రపరుస్తారు.

Health: ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని నిల్వ చేయడం క్షేమమేనా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు..!
Food Storage
Shiva Prajapati
|

Updated on: Jun 07, 2023 | 5:10 PM

Share

నేటి ఆధునిక జీవనశైలిలో.. మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయడం పరిపాటిగా మారింది. ఆఫీసుల్లో పని చేసే వారు మరుసటి రోజు వారికి టైమ్ సేవ్ అయ్యేలా, బాక్స్ కోసం ఎక్కువ ఆహారాన్ని వండుతారు. అయితే, మిగిలిపోయిన ఆహారాన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టి ఫ్రిజ్‌లో భద్రపరుస్తారు. మరి ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారాన్ని పెట్టి, ఫ్రిజ్‌లో భద్రపరచడం మంచిదేనా? దీనికి సంబంధించి ఇవాళ మనం ఇంట్రస్టింగ్ వివరాలు తెలుసుకుందాం..

ప్లాస్టిక్ కంటైనర్లు ఫ్రిజ్‌లో ఉంచడం సురక్షితమేనా?

గతంలో పెద్దలు ఆహారాలు వండటం కోసం, నిల్వ కోసం మట్టి పాత్రలు, చెక్కతో తయారు చేసిన పాత్రలను వినియోగించేవారు. కానీ, రోజులు మారుతున్నా కొద్ది.. ప్రజల జీవనశైలిలోనూ మార్పులు వస్తున్నాయి. మట్టి, చెక్క స్థానంలో ప్లాస్టిక్, లోహపు పాత్రలు వచ్చేశాయి. లోహపు పాత్రలు కూడా క్రమేణా కనుమరుగై.. పూర్తిగా ప్లాస్టిక్ వినియోగంలోకి వెళ్తోంది సమాజం. మరి ప్లాస్టిక్ పాత్రల వినియోగం క్షేమమేనా? ఆరోగ్యకరమేనా? అంటే ఎంతమాత్రం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారాన్ని ప్యాక్ చేయడం వలన అనేక సమస్యలు వస్తాయంటున్నారు. వీటి బదులుగా అల్యూమినియం ఫాయిల్‌ను ఉపయోగించొచ్చని సూచిస్తున్నారు. పాలిథిలిన్ టెరాఫ్తలెట్

మార్కెట్‌లో లభించే పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ ప్లాస్టిక్ కంటైనర్‌లు వినియోగం ఎక్కువగా ఉంది. ఈ ప్లాస్టిక్ పాత్రను నీటితో శుభ్రం చేసి మళ్లీ మళ్లీ వినియోగించే అవకాశం ఉంటుంది. కానీ, పదే పదే కడగడం వల్ల అందులో ఉండే రసాయనాలు ఆహారంలో, నీళ్లలో కలిసిపోతాయి. రాత్రివేళ గానీ, ఉదయం సమయంలో గానీ ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టడం వలన అందులోని రసాయనాలు ఆహారంలో కలిసిపోతాయి. తద్వారా అనారోగ్యానికి గురవుతారు. అందుకే.. ప్లాస్టిక్ పాత్రలో ఏమైనా సమస్యలుంటే వెంటనే దాని వినియోగం ఆపేయాలి. లేదంటే.. ఏరికోరి అనారోగ్య సమస్యలను తెచ్చుకున్నట్లు అవుతుంది.

ఇవి కూడా చదవండి

బయో ప్లాస్టిక్ ఉపయోగించొచ్చు..

మిగిలిపోయిన ఆహారాన్ని, ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి, బయో ప్లాస్టిక్ ఉపయోగించొచ్చు. బయో ప్లాస్టిక్‌ను ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దీని తయారీకి మొక్కజొన్న, బంగాళదుంపలు, చెరకు ఉపయోగిస్తారు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..