Bengaluru: హంతకుడిని పోలీసులకు పట్టించిన ‘కింగ్ కోహ్లీ’.. ఎలాగో తెలిస్తే అవాక్కవుతారు..!

82 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసిన పరారీలో ఉన్న నిందితులను ‘కింగ్ కోహ్లీ’ పట్టించాడు. ‘కింగ్ కోహ్లీ’ చేసిన సహాయంతో పోలీసులు సునాయాసంగా నిందితులను గుర్తించి, అరెస్ట్ చేశారు. కింగ్ కోహ్లీ ఏంటీ.. నిందితులను పట్టించడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? ఆ మ్యాటర్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. వృద్దురాలిని హత్య చేసి పారిపోయిన..

Bengaluru: హంతకుడిని పోలీసులకు పట్టించిన ‘కింగ్ కోహ్లీ’.. ఎలాగో తెలిస్తే అవాక్కవుతారు..!
Arrest
Follow us

|

Updated on: Jun 05, 2023 | 7:06 AM

82 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసిన పరారీలో ఉన్న నిందితులను ‘కింగ్ కోహ్లీ’ పట్టించాడు. ‘కింగ్ కోహ్లీ’ చేసిన సహాయంతో పోలీసులు సునాయాసంగా నిందితులను గుర్తించి, అరెస్ట్ చేశారు. కింగ్ కోహ్లీ ఏంటీ.. నిందితులను పట్టించడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? ఆ మ్యాటర్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. వృద్దురాలిని హత్య చేసి పారిపోయిన నిందితులను గుర్తించడంలో.. బెంగళూరు పోలీసులకు ఆటోరిక్షా వెనుక వైపున ఉన్న ‘కింగ్ కోహ్లీ’ అనే పదాలు సహాయపడాయి. అప్పులు తీర్చడం కోసం నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు.

వివరాల్లోకెళితే.. మహాలక్ష్మీపురం నివాసి కమలమ్మ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది ఉంది. తన ఇంట్లో చేతులు, కాళ్లు కట్టేసి, నోటిని టేప్‌తో చుట్టేసి దారుణంగా హతమార్చారు దుండగులు. మే 27న ఈ హత్య జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు లగ్గెరెకు చెందిన సిద్దరాజు (34), ఆర్ అశోక్ (40), కామాక్షిపాళ్యానికి చెందిన సి అంజనమూర్తి (33)గా దర్యాప్తు అధికారులు గుర్తించారు. శుక్రవారం వారిని అరెస్టు చేశారు. అప్పులు తీర్చడం కోసం నిందితులు పథకం ప్రకారం.. వృద్ధురాలిని హత్య చేశారని డీసీపీ (నార్త్) శివ ప్రకాష్ దేవరాజు మీడియాకు తెలిపారు.

డీసీపీ మాట్లాడుతూ.. ‘‘ప్లంబింగ్ పనుల కోసం అశోక్ కమల ఇంటికి వెళ్ళాడు. ఆమె ఒంటరిగా నివసిస్తున్నట్లు గమనించాడు. ఆమె భర్త గత అక్టోబర్‌లో చనిపోయాడు. ఈ విషయాన్ని అశోక్.. తన స్నేహితులతో తెలిపాడు. ముగ్గురూ కలిసి కమల బంగారు ఆభరణాలు దోచుకోవడానికి ప్లాన్ వేశారు. దీని ప్రకారం.. మే 27 ఉదయం, నిందితులు అంజనమూర్తి ఆటోరిక్షా రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను తీసివేసారు. అయితే, ఆ ఆటో వెనుక ‘కింగ్ కోహ్లీ’ అని పేరు ఉంది. ఆ ఆటోలో కమల ఇంటికి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం ఆమె వద్దకు వెళ్లి గ్యారేజీలో స్థలాన్ని అద్దెకు ఇవ్వగలరా అని అడిగే నెపంతో బాధితురాలి సంప్రదించారు. ఇంట్లోకి ప్రవేశించగానే నిందితులు కమల కాళ్లు, చేతులు కట్టేసి, నోటిని టేపుతో కప్పి హత్య చేశారు. ఈ సమయంలో అశోక్ నివాసం బయట కాపలా ఉన్నాడు. అనంతరం ఆమె ఆభరణాలు దోచుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

నిందితుల కదలికలను చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. కమల ఇంటి వద్ద ఆటో రిక్షాతో అనేక రౌండ్స్ వేయడం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆటో నెంబర్ ప్లేట్ తొలగించారు అయితే, ఆటో వెనుకాల.. ‘కింగ్ కోహ్లీ’ అనే పేరు ఉంది. ఆ పేరుగా ఆధారంగా వేట సాగించారు పోలీసులు. ఇంకేముంది.. నిందితులు ఇట్టే దొరికిపోయారు. హంతకులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..