Beer Yoga: మూడు సిప్‌లు, ఆరు స్కిట్లు.. ఇంతటి అవకాశం ఇస్తే ఎవరైనా ఎందుకు కాదంటారు బ్రో.. రచ్చ రచ్చే ఇక..!

యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. భారతదేశంలో పుట్టిన ఈ యోగా.. నేడు ప్రపంచానికి కీలకంగా మారింది. ఈ క్రమంలోనే యోగాను ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పాశ్చాత్య దేశాల ప్రజలు కూడా యోగా బాటలో పయనిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ఈ యోగాను చిత్రవిచిత్రంగా చేస్తూ..

Beer Yoga: మూడు సిప్‌లు, ఆరు స్కిట్లు.. ఇంతటి అవకాశం ఇస్తే ఎవరైనా ఎందుకు కాదంటారు బ్రో.. రచ్చ రచ్చే ఇక..!
Beer Yoga
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 04, 2023 | 7:29 AM

యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. భారతదేశంలో పుట్టిన ఈ యోగా.. నేడు ప్రపంచానికి కీలకంగా మారింది. ఈ క్రమంలోనే యోగాను ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పాశ్చాత్య దేశాల ప్రజలు కూడా యోగా బాటలో పయనిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ఈ యోగాను చిత్రవిచిత్రంగా చేస్తూ.. వైరల్ అవుతున్నారు. తాజాగా ‘బీర్ యోగా’ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చేతిలో బీర్ టిన్‌ పట్టుకుని, ఓవైపు సిప్ తాగడం.. మరోవైపు ఆసనం వేయడం.. చేస్తున్నారు ప్రజలు. ఈ యోగా ఇప్పుడు విదేశాల్లో బాగా పాపులర్ అవుతోంది. ఓ చేత్తో బీర్ బాటిల్ పట్టుకుని, యోగాసనాలు వేయడాన్ని ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో రోడ్డు పక్కన కొందరు ఈ బీర్ యోగా ఆసనాలు చేస్తున్నారు. వీరి యోగాను వీడియో తీసి సోష్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. మరెందుకు ఆలస్యం.. ఈ వింత యోగాను మీరూ చూసేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..