Garlic – Ginger Paste: అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను ఈ విధంగా తయారు చేయండి.. టేస్ట్‌తో పాటు ఎక్కువకాలం ఫ్రెష్‌గా ఉంటుంది..

Garlic - Ginger Paste: ప్రతి ఒక్కరూ రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడతారు. ఆహారాన్ని రుచికరంగా మార్చడంలో అల్లం-వెల్లుల్లి పేస్ట్ ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. వంట గదిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనిది ఏ వంట పూర్తవదు. అయితే, బయట కొనుక్కొచ్చే పేస్ట్ నిజమైనదో, కల్తీ చేసిందో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు కేటుగాళ్లు అన్నింటినీ కల్తీ చేసి విక్రయాలు జరుపుతున్నారు.

Garlic - Ginger Paste: అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను ఈ విధంగా తయారు చేయండి.. టేస్ట్‌తో పాటు ఎక్కువకాలం ఫ్రెష్‌గా ఉంటుంది..
Ginger Paste
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 05, 2023 | 7:05 AM

Garlic – Ginger Paste: ప్రతి ఒక్కరూ రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడతారు. ఆహారాన్ని రుచికరంగా మార్చడంలో అల్లం-వెల్లుల్లి పేస్ట్ ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. వంట గదిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనిది ఏ వంట పూర్తవదు. అయితే, బయట కొనుక్కొచ్చే పేస్ట్ నిజమైనదో, కల్తీ చేసిందో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు కేటుగాళ్లు అన్నింటినీ కల్తీ చేసి విక్రయాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది ప్రజలు ఒకేసారి అల్లం, వెల్లుల్లి తీసుకుని పేస్ట్ చేసి, ఫ్రిడ్జ్‌లలో భద్రపరుస్తారు. అయితే, వారు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా.. ఈ పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఫలితంగా అది వెంటనే పాడైపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని సులభంగా తయారు చేయడంతో పాటు, ఎక్కువ కాలం మన్నిక ఉండే చిట్కాలు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు..

1. అల్లం 100 గ్రాములు

2. వెల్లుల్లి 150 గ్రాములు

ఇవి కూడా చదవండి

3. వెనిగర్ ఒక టీస్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేయాలి..

వెల్లుల్లి అల్లం పేస్ట్ చేయడానికి ముందుగా నీళ్లలో వేసి అరగంట సేపు అలాగే ఉంచి చేతులతో బాగా రుద్ది శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే అల్లంలో మట్టి ఉంటుంది. దాని వల్ల అల్లం పేస్ట్ రుచి మారుతుంది. ఆ తరువాత, అల్లం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను వేరు చేసి పొట్టు తీసేయాలి. వాటిని ఒక గిన్నెలో ఉంచాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో అల్లం ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఒకటి లేదా రెండుసార్లు రుబ్బాలి. తర్వాత జార్ మూత తెరిచి, దానిలో ఒక చెంచా వెనిగర్ వేసి, మళ్లీ బ్లెండ్ చేసి మెత్తని పేస్ట్ లా చేయాలి. ఒక గాజు పాత్రలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసి, గాలి లోపలికి రాని విధంగా మూత పెట్టాలి. ఇప్పుడు ఫ్రిజ్‌లో పెట్టాలి. అల్లం పేస్ట్ ఇలా చేయడం వలన కొన్ని రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది.

నోట్: వెల్లుల్లిని దాని పై తొక్క తీసివేసిన తర్వాత మాత్రమే రుబ్బుకోవాలి. చాలామంది వెల్లుల్లిని పొట్టు తీయకుండా రుబ్బుతారు. దీని వల్ల కూడా పేస్ట్ పాడైపోతుంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..