Monday Puja Tips: ఆర్ధిక ఇబ్బందులా … ఐదు సోమవారాలు శివయ్యకు ఇలా పూజ చేసి చూడండి..

సోమవారం హృదయపూర్వకంగా శివుని పూజించడం వల్ల ఇంట్లో ఆర్ధిక కష్టాలు ఉండవు.. డబ్బులకు ఇబ్బందులు ఏర్పడవు. ఇంట్లో ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే శివుడిని పూజిస్తూ.. ఐదు సోమవారం కొన్ని చర్యలు చేయాలని సూచించారు.

Monday Puja Tips: ఆర్ధిక ఇబ్బందులా ... ఐదు సోమవారాలు శివయ్యకు ఇలా పూజ చేసి చూడండి..
Lord Shiva Monday Puja
Follow us
Surya Kala

|

Updated on: Jun 05, 2023 | 7:11 AM

సోమవారం లయకారుడు శివుడికి అంకితం చేయబడింది. ఈ రోజున శివలింగానికి  పాలు లేదా గంగాజలంతో భక్తులు అభిషేకం చేస్తారు. సోమవారం శివుడిని ఆరాధించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. జీవితంలోని అన్ని కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని విశ్వాసం. సోమవారం హృదయపూర్వకంగా శివుని పూజించడం వల్ల ఇంట్లో ఆర్ధిక కష్టాలు ఉండవు.. డబ్బులకు ఇబ్బందులు ఏర్పడవు. ఇంట్లో ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే శివుడిని పూజిస్తూ.. ఐదు సోమవారం కొన్ని చర్యలు చేయాలని సూచించారు. డబ్బు ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం సోమవారం శివయ్య పూజ లో చేయాల్సిన చర్యల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

సోమవారం చేయాల్సిన పరిహారాలు:

  1. సోమవారం శివుడికి, చంద్రుడికి సంబంధించిన రోజుగా పరిగణించబడుతుంది. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి, శివ శంకరుడిని దర్శించి శివ చాలీసా లేదా శివాష్టకాన్ని పఠించండి. శివుడిని ఇలా పూజించడం వలన చాలా సంతోష పడతాడని.. తనని పూజించే భక్తులపై అనుగ్రహం కురిపిస్తాడని.. ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదని విశ్వాసం.
  2. సోమవారం ఉదయాన్నే శివునికి గౌరీ శంకర రుద్రాక్షను సమర్పిస్తే, అది మీ వైవాహిక జీవితంలో లేదా వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అంతేకాదు ఇంట్లో డబ్బులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు.
  3. సోమవారం ఉదయం తెల్లటి చందనాన్ని బిల్వ పత్రానికి పూసి..  మనసులో కోరికను చెప్పి శివయ్యకు ఆ బిల్వ పత్రాన్ని సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరడంతో పాటు ఇంట్లో లక్ష్మీ దేవి నివాసం ఉంటుంది.
  4. సోమవారం శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి. రాగి పాత్రలో పాలు తీసుకుని పని చేసే చోట పాలతో శుద్ధి చేస్తూ.. ఓం నమఃశివాయ్ అని జపిస్తూనే ఉండండి. ఇలా చేయడం వల్ల వ్యాపారాభివృద్ధి జరగడమే కాదు.. ఇంట్లో డబ్బులకు ఇబ్బందులు ఉండవు.
  5. సోమవారం శివాలయానికి వెళ్లి.. శివయ్య దర్శనం చేసుకుని.. రుద్రాక్ష మాలతో ‘ఓం నమో ధనదాయ స్వాహా’ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల అనుకున్నది జరుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి.
ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్