Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ఈ రోజే ఈ మూడు విగ్రహాలను మీ ఇంటికి తెచ్చుకోండి…మీ ఇంట్లో డబ్బు వర్షం కురవడం పక్కా

ఇంట్లో కొన్ని విగ్రహాలను ఉంచడం వాస్తు ప్రకారం చాలా శుభప్రదం. ఈ మూడు విగ్రహాలను ఇంట్లో ఉంచుకుంటే ఒక్కరాత్రిలో మీ అదృష్టం మారిపోతుంది. ఏ విగ్రహాలను ఇంట్లో ఉంచుకుంటే మీకు వాస్తుపరంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం.

Vastu Tips : ఈ రోజే ఈ మూడు విగ్రహాలను మీ ఇంటికి తెచ్చుకోండి...మీ ఇంట్లో డబ్బు వర్షం కురవడం పక్కా
Vastu Tips
Follow us
Madhavi

| Edited By: Phani CH

Updated on: Jun 05, 2023 | 9:53 AM

ఇంట్లో సానుకూల శక్తి ఉంటే, ఆ ఇంటి సభ్యులను చెడుశక్తి ప్రభావాల నుంచి రక్షించడం సులువు అవుతుంది. అందుకే ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి. వాస్తు శాస్త్రం ఇంట్లో ఏ వస్తువును ఏ వైపు ఉంచాలో..ఇంట్లో నుంచి ఎలాంటి వస్తువులను తీసివేయాలో వాస్తు చెబుతుంది. ఈ వాస్తు నియమాలన్నీ పాటిస్తే ఇంట్లో ఎల్లప్పుడూ సుఖశాంతులు ఉంటాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మూడు విగ్రహాలను ఉంచడం చాలా శుభప్రదం. ఈ మూడు విగ్రహాలను తెచ్చుకుంటే ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈరోజు మీరు ఏ మూడు విగ్రహాలను ఇంటికి తీసుకురావాలో తెలుసుకుందాం.

ఏనుగు:

ఇంట్లో ఏనుగు విగ్రహం ఉండటం చాలా మంచిది . వాస్తు ప్రకారం ఏనుగు శాంతికి చిహ్నం. అందుకే ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఆ ఇంట్లో అలజడి, కష్టాలు కనిపించవు. ఏనుగు విగ్రహం ఉన్న ఇంట్లో తల్లి లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుంది. మీ ఇల్లు గందరగోళం, కలహాలు, సమస్యలతో బాధపడుతుంటే, ఈరోజు మీ ఇంట్లో వెండి లేదా కంచుతో చేసిన ఏనుగు విగ్రహాన్ని తప్పకుండా కొనుగోలు చేసి మీ ఇంట్లో ఉంచండి. ఫలితంగా, మీ కుటుంబం నుండి అన్ని వాస్తు దోషాలు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

తాబేలు:

తాబేలు విగ్రహాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచండి. ఈ రెండు కూడా నారాయణుని అంశలుగా పరిగణిస్తారు. విష్ణువు కూర్మావతార రూపాన్ని ధరించాడు. కావున తాబేలు విగ్రహానికి ఉత్తరం లేదా తూర్పు దిక్కున ఉంచితే ప్రసన్నుడవుతాడు. కానీ ఈ తాబేలు తప్పనిసరిగా ఏదో లోహంతో తయారు చేసి ఉండాలని గుర్తుంచుకోండి. దాని శుభ ప్రభావం కారణంగా, ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు నెలకొంటుంది.

చేప:

విష్ణువు కూడా మత్స్యావతారంలో ఉంటారు. ఈ కారణంగా, వెండి లేదా కంచుతో చేసిన చేపలను ఉంచడం వాస్తు శాస్త్రంలో చాలా శ్రేయస్కరం. చేప విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి ఈశాన్యం వైపు ఉంచాలి. ఫలితంగా, మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు. కుటుంబ సభ్యుల మనస్సులో సంతృప్తి ఉంటుంది. ఎలాంటి సమస్యలు తలెత్తవు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).