Auto News: కారు సైడ్ మిర్రర్‌లో దూరంగా వస్తువులు సైతం దగ్గరగా ఎందుకు కనిపిస్తాయి? ఇంట్రస్టింగ్ సీక్రెట్ ఇదే..!
Outside rear view mirror: కార్లలో చాలా ఫీచర్స్ ఉంటాయి. కాస్ట్ మారుతున్నా కొద్ది.. అందులోని ఫీచర్స్ కూడా ఛేంజ్ అవుతాయి. అవి మన భద్రతను పెంచేవిగా ఉంటాయి. అయితే, ఆ ఫీచర్స్ గురించి అందరికీ పెద్దగా తెలియదు. ప్రజలు కూడా అంతగా పట్టించుకోరు. ఇలాంటి ఫీచర్లలో కారు ఔట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్..
Outside rear view mirror: కార్లలో చాలా ఫీచర్స్ ఉంటాయి. కాస్ట్ మారుతున్నా కొద్ది.. అందులోని ఫీచర్స్ కూడా ఛేంజ్ అవుతాయి. అవి మన భద్రతను పెంచేవిగా ఉంటాయి. అయితే, ఆ ఫీచర్స్ గురించి అందరికీ పెద్దగా తెలియదు. ప్రజలు కూడా అంతగా పట్టించుకోరు. ఇలాంటి ఫీచర్లలో కారు ఔట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్(ORVM) కూడా ఒకటి. కారుల బయటి అద్దాలను గమనించినట్లయితే.. అందులో కనిపించే వస్తువులు, ఇతర వాహనాలు చాలా దూరంగా ఉన్నప్పటికీ.. దగ్గరగా ఉన్నట్లుగానే కనిపిస్తాయి. ఇదే విషయం అద్దంపైనా రాసి ఉంటుంది. దీనికి కారణం.. అద్దం రూపకల్పనలో దాగి ఉంది.
చాలా కార్లలో ఓఆర్‌వీఎం లకు కుంభాకార అద్దం ఉపయోగించడం జరుగుతుంది. ఇందులో గాజు ప్రతిబింబ ఉపరితలం కాంతి మూలాన్ని అంచనా వేస్తుంది. ఈ కారణంగా అద్దం మీద పడే కాంతి ఎక్కువ చెల్లా చెదురు అవుతుంది. ఫలితంగా చిన్న అద్దంలోనూ ఎక్కువ వాహనాలు, వస్తువులను చూసేందుకు అవకాశం ఉంటుంది. కుంభాకార అద్దం కారణంగా కారును భద్రంగా, సరైన మార్గంలో నడిపేందుకు వీలుంటుంది.
అద్దంలో వస్తువులు చిన్నవిగా కనిపించే విధానాన్ని కనిష్టీకరణ అంటారు. అద్దం వంపు ఎక్కువగా ఉంటే.. డ్రైవింగ్ చేసేటప్పుడు భద్రతాపరంగా కనిష్టీకరణ కూడా చాలా ముఖ్యం. కాగా, అధిక కనిష్టీకరణ కారణంగా ఓఆర్‌వీఎంలలో చిన్న వస్తువులు చాలా దూరంగా ఉన్నట్లుగా కనిపిస్తాయి. డ్రైవింగ్ సమయంలో ఇది మన బ్రెయిన్‌ను అలర్ట్‌గా ఉంచడంలో సహకరిస్తుంది.
మరిన్ని టెక్ న్యూస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..