Acer Aspire Vero: రీసైకిల్డ్ ప్రొడెక్ట్స్ తో ఏసర్ నుంచి సూపర్ ల్యాప్‌టాప్.. అదిరిపోయే స్పెసిఫికేషన్లు తెలిస్తే వావ్ అంటారంతే
పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఏసర్ కంపెనీ ఏసర్ ఆస్పైర్ వెరో పేరుతో రీసైకిల్ పదార్థాలతో తయారు చేసిన ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
భారతదేశంలో వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ పెరగడంతో ప్రతి ఉద్యోగి దగ్గర ల్యాప్‌టాప్ ఉండాల్సి వస్తుంది. అలాగే ఆన్‌లైన్ క్లాసులు ట్రెండ్ కూడా నడుస్తుండడంతో ప్రతి ఇంట్లో కూడా ల్యాప్‌టాప్ తప్పనిసరైంది. అయితే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఏసర్ కంపెనీ ఏసర్ ఆస్పైర్ వెరో పేరుతో రీసైకిల్ పదార్థాలతో తయారు చేసిన ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 30 శాతం పీసీఆర్ ప్లాస్టిక్‌తో పాటు 50 శాతం పీసీఆర్ కీక్యాప్‌లతో దీన్ని రూపొందించారు. బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో ఓసెన్‌గ్లాస్ టచ్‌ప్యాడ్ ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత. ఏసర్ అస్పైర్ విరో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ డిస్‌ప్లేతో 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగిన 14 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి ఈ ల్యాప్‌టాప్ ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం
ఈ ల్యాప్‌టాప్ టీఎన్నార్ (టెక్నికలర్ కలర్ సర్టిఫికేషన్) కారణంగా నిజమైన టోన్ రంగులను పునరుత్పత్తి చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో క్యూహెచ్‌డీ వెబ్‌క్యామ్, ఆడియో, విజువల్ క్లారిటీని మెరుగుపరచడానికి బ్రాండ్ యొక్క ఏఐ పవర్డ్ ప్యూర్ వ్యూతో పాటు ప్యూరిఫైడ్ వాయిస్ సొల్యూషన్‌లు ఉన్నాయి. ఏసర్ అస్పైర్ విరో 13 జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 Intel Core i5 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇది 16 జీబీ + 512 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. 48 డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీ యూనిట్‌తో ఆధారితంగా పని చేసే ఈ ల్యాప్‌టాప్ 12 గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. వివిధ కార్యాచరణ మోడ్‌లతో శక్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే వెరోసెన్స్ బ్యాటరీ నిర్వహణ ఉంది. వైఫై-6, రెండు థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు, ఒక హెచ్‌డీఎంఐ పోర్ట్, మూడు యూఎస్‌బీ పోర్టులు, బ్లూటూత్ 5.1 సపోర్ట్ చేస్తుంది. ఏసర్ అస్పైర్ విరో కోర్ ఐ3 వేరియంట్ ధర రూ. 49,999గా ఉంది. అయితే కోర్ ఐ5 మోడల్ ధర రూ. 64,999గా ఉంది. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఏసర్ ఈ-స్టోర్, ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అలాగే ఈ ల్యాప్‌టాప్ కొనుగోలుపై అదనంగా రూ.5000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..