Xiaomi Air Conditioner: ఈ ఏసీ చాలా ‘హాట్’ గురూ.. అతి తక్కువ విద్యుత్‌తో ఫాస్ట్ కూలింగ్..
జియోమీ ఇప్పుడు ఎయిర్ కండిషనర్ల(ఏసీ) తయారీపై ఫోకస్ పెట్టింది. తన మీజియా బ్రాండ్ పేరుతో కొత్త ఎయిర్ కండిషనర్ ను చైనాలో లాంచ్ చేసింది. ఈ సరికొత్త మీజియా ఏసీ 3హెచ్ పీ గోల్డ్ ఎడిషన్ గా పవర్ సేవింగ్ ఆప్షన్స్ తో మార్కెట్లోకి వచ్చింది.
మన దేశంలో జియోమీ అంటే అందరికీ ఫోన్ల తయారీ కంపెనీగానే పరిచయం. స్మార్ట్ టీవీలు కూడా ఆ కంపెనీవి ఉన్నా అంతగా జనాదరణ పొందలేదు. అయితే జియోమీ ఇప్పుడు ఎయిర్ కండిషనర్ల(ఏసీ) తయారీపై ఫోకస్ పెట్టింది. తన మీజియా బ్రాండ్ పేరుతో కొత్త ఎయిర్ కండిషనర్ ను చైనాలో లాంచ్ చేసింది. ఈ సరికొత్త మీజియా ఏసీ 3హెచ్ పీ గోల్డ్ ఎడిషన్ గా పవర్ సేవింగ్ ఆప్షన్స్ తో మార్కెట్లోకి వచ్చింది. ఇది ఏడాదిలో ఏకంగా 489kWh ల ఎనర్జీని ఆదా చేస్తుందని కంపెనీ ప్రకటించుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
జియోమీ ఎయిర్ కండీషనర్ డిజైన్..
జియోమీ మీజియా ఎయిర్ కండిషనర్ వెలుపలి డిజైన్ గోల్డ్ ప్లేటెడ్ తో ఉంటుంది. దీని కారణంగా ఏసీ లుక్ చాలా మోడ్రన్ గా ఉంటుంది. ఈ ఎయిర్ కండీషనర్‌కి మీజియా స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్, ఇంటెలిజెంట్ కంట్రోల్స్ యాక్సెస్ ఉంది. స్మార్ట్‌ఫోన్ యాప్‌తో పాటు వాయిస్ కమాండ్‌లతో కంట్రోల్ చేయొచ్చు. ఈ ఎయిర్ కండీషనర్‌ను వాక్యూమ్ రోబోట్‌లు, డోర్ లాక్‌లు, ల్యాంప్స్ వంటి స్మార్ట్ పరికరాలకు కనెక్ట్ చేయవచ్చు.
అతి తక్కువ విద్యుత్ వినియోగం..
ఈ మీజియా ఎయిర్ కండీషనర్ 3హెచ్ పీ గోల్డ్ ఎడిషన్ పూర్తి డీసీ ఫ్రీక్వెన్సీ కన్వర్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. శక్తిని ఆదా చేయడానికి, చైనాలో ప్రవేశపెట్టిన ఈ ఏసీలో లెవల్ 2కి 3.91 వరకు ఏపీఎఫ్ విలువ ఇచ్చారు. దీని ప్రకారం, ఈ ఏసీ వార్షిక విద్యుత్ వినియోగాన్ని 489 kWh వరకు తగ్గించగలదు. ఈ కొత్త ఎయిర్ కండీషనర్ విండ్ మోడ్ గతంలో వాడుకలో ఉన్న లెవల్ 3 ఎయిర్ కండీషనర్ కంటే మరింత సమర్థవంతమైనది. నానోపీ, కార్పెట్, సరౌండ్ విండ్ మోడ్‌లు ఉంటాయి.
జియోమీ మీజియా ఏసీ ధర ఎంత ఉంటుంది?
కొత్త జియోమీ మీజియా ఎయిర్ కండీషనర్ 3హెచ్ పీ గోల్డ్ ఎడిషన్ డ్యూయల్ కంట్రోల్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఆటోమేటిక్ గా టెంపరేచర్, తేమ సర్దుబాటు చేయగలుతుంది. చైనాలో లాంచ్ అయిన ఈ జీయోమీ ఎయిర్ కండీషనర్ ధర ప్రారంభ ఆఫర్ కింద 3,999 యువాన్లు (మన కరెన్సీలో దాదాపు రూ. 47,700)గా ఉంది. లాంచ్ ప్రమోషన్ తర్వాత, ఈ ఎయిర్ కండీషనర్ ధర 4,299 యువాన్లు (సుమారు రూ. 51,200) కు విక్రయించనుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..