Fitness Bands Under 3000: ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారా? ఈ సూపర్ ఫిట్‌నెస్ బాండ్స్ గురించి తెలుసుకోండి..
ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడేలా అన్ని కంపెనీలు స్మార్ట్ వాచ్‌లు రిలీజ్ చేస్తున్నాయి. రోజువారీ ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తూ ఎప్పటికప్పుడు హెచ్చరకి సందేశాలను పంపుతున్న స్మార్ట్ వాచ్‌లను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి స్థాయిలను ట్రాక్ చేయడంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్, హార్ట్ బీట్ వంటివి ట్రాక్ చేయడం ద్వారా స్మార్ట్ వాచ్‌లు యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుత రోజుల్లో ప్రజలు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మారుతున్న టెక్నాలజీ ప్రకారం రోజువారీ ఎన్ని క్యాలరీలను ఖర్చు చేశామో? తెలిపేలా స్మార్ట్ యాక్ససరీస్ అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉండే ఈ రోజుల్లో ఈ స్మార్ట్ యాక్ససరీస్‌ను ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకునే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది వీటిని వాడడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడేలా అన్ని కంపెనీలు స్మార్ట్ వాచ్‌లు రిలీజ్ చేస్తున్నాయి. రోజువారీ ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తూ ఎప్పటికప్పుడు హెచ్చరకి సందేశాలను పంపుతున్న స్మార్ట్ వాచ్‌లను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి స్థాయిలను ట్రాక్ చేయడంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్, హార్ట్ బీట్ వంటివి ట్రాక్ చేయడం ద్వారా స్మార్ట్ వాచ్‌లు యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫిట్‌నెస్ గురించి ఆలోచించేవారు కచ్చితంగా స్మార్ట్ వాచ్ వాడుతున్నారు. అయితే అన్ని సదుపాయాలు ఉన్న స్మార్ట్ వాచ్‌లు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. రూ.3000 లోపు అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్‌లపై ఓ లుక్కేద్దాం.
బీట్‌ఎక్స్‌పి వేగా స్మార్ట్‌వాచ్
అధిక ఫ్యాషన్‌గా కనిపించే స్మార్ట్ వాచ్ కోరుకునే వారు ఈ వాచ్‌ను ట్రై చేయవచ్చు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్న బీట్‌ఎక్స్‌పి వేగా స్మార్ట్‌వాచ్‌ను అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఫిట్‌నెస్ ట్రాకర్ ఇండోర్, అవుట్‌డోర్ కార్యకలాపాలకు అద్భుతంగా పని చేస్తుంది. మీ హృదయ స్పందన, ఒత్తిడి, భావోద్వేగాలు, నిద్ర వంటివి ఈ స్మార్ట్ వాచ్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్‌తో మీ ఫిట్‌నెస్‌ను ఈ వాచ్ నిరంతరం ట్రాక్ చేస్తుంది. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో వచ్చే ఈ వాచ్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
నాయిస్ కలర్ ఫిట్ పల్స్ 3
నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3 సూపర్ స్టైలిష్‌గా ఉండడమే కాకుండా దీని ఫంక్షనాలిటీ పరంగా కూడా అత్యుత్తమ ఎంపికగా ఉంటుంది. ఇది మీరు ఎంచుకోగల 5 విభిన్న షేడ్స్‌లో వస్తుంది – జెట్ బ్లాక్, వింటేజ్ బ్రౌన్, సిల్వర్ గ్రే, జాడే గ్రీన్, రోజ్ పింక్. ఈ వాచ్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే అది మీకు 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. 100 స్పోర్ట్స్ మోడ్‌లతో వచ్చే ఈ వాచ్ హృదయ స్పందన రేటును పర్యవేక్షించడానికి, ఒత్తిడిని కొలవడానికి, నిద్రను విశ్లేషించడానికి సాయం చేస్తుంది.
వన్ ప్లస్ స్మార్ట్ బ్యాండ్
వన్ ప్లస్ స్మార్ట్ బ్యాండ్ వాచ్ 1.1-అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే 126 x 294 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. స్క్రీన్ ప్రకాశాన్ని ఐదు వేర్వేరు స్థాయిలకు సర్దుబాటు చేయవచ్చు. రాత్రి సమయంలో స్క్రీన్ ప్రకాశాన్ని తగ్గించడానికి సాఫ్ట్‌వేర్ టోగుల్‌ని కలిగి ఉంది. ఈ పరికరం బ్లూటూత్ 5 అనుకూలమైనది మరియు 100ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ వాచ్ 14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. మీ ఆరోగ్యాన్ని నిరంతరం ట్రాక్ చేస్తుంది.
బోట్ ఎక్స్‌టెండ్
ఈ స్మార్ట్‌వాచ్ నాలుగు రంగుల్లో వస్తుంది. శాండీ క్రీమ్, ఆలివ్ గ్రీన్, డీప్ బ్లూ, పిచ్ బ్లాక్. స్మార్ట్‌వాచ్ యక్క బ్యాటరీ మీరు ఉపయోగించే సమయాన్ని బట్టి సులభంగా ఒక వారం వరకు ఉంటుంది. ఇది రిమైండర్‌లు, అలారాలు, ప్రశ్నలు అడగడంలో సాయపడేటా అలెక్సా అంతర్నిర్మిత ఫీచర్‌తో వస్తుంది. ఇది హైకింగ్, సైక్లింగ్, క్రికెట్, యోగా, అవుట్‌డోర్ రన్నింగ్, స్విమ్మింగ్ వంటి వాటితో సహా 120 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది.
ఫైర్-బోల్ట్ ఫీనిక్స్
విలక్షణమైన లక్షణాలతో ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ మిమ్మల్ని ఫ్యాషన్, యుటిలిటీ విషయంలో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ 5 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ స్మార్ట్‌వాచ్ చాలా తేలికగా ఉంటుంది. ఇంకా, వాచ్ ధరించడం చాలా హాయిగా ఉంటుంది. వ్యాయామ ట్రాకర్, క్యాలరీల వినియోగం, నిద్రపోయే సమయం వంటి వాటిని ఈ వాచ్ చాలా సులభంగా ట్రాక్ చేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..