Noise Color Fit Mighty: యాపిల్ లుక్‌లో నాయిస్ కొత్త స్మార్ట్ వాచ్.. కేవలం రూ. 2వేల లోపు ధరలోనే..

మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా? హెల్త్ ట్రాకర్లతో పాటు బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్లతో కూడిన వాచ్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకు ఇది బెస్ట్ ఆప్షన్.. తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లుండే ఓ స్మార్ట్ వాచ్ ఇటీవల మార్కెట్లో లాంచ్ అయ్యింది.

Noise Color Fit Mighty: యాపిల్ లుక్‌లో నాయిస్ కొత్త స్మార్ట్ వాచ్.. కేవలం రూ. 2వేల లోపు ధరలోనే..
Noise Colorfit Mighty
Follow us
Madhu

|

Updated on: May 30, 2023 | 7:30 AM

మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా? హెల్త్ ట్రాకర్లతో పాటు బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్లతో కూడిన వాచ్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకు ఇది బెస్ట్ ఆప్షన్.. తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లుండే ఓ స్మార్ట్ వాచ్ ఇటీవల మార్కెట్లో లాంచ్ అయ్యింది. దేశీయ బ్రాండ్ అయిన నాయిస్ ఈ వాచ్ ను ఆవిష్కరించింది. నాయిస్ కలర్‌ఫిట్ మైటీ పేరుతో దీనిని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. మెటాలిక్ ఫినిష్‍తో లుక్ పరంగా కాస్త ప్రీమియమ్‍గా కనిపిస్తోంది. దీని డిజైన్ యాపిల్ స్మార్ట్ వాచ్ ను పోలి ఉంది. ఈ నాయిస్ కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్ వాచ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్పెసిఫికేషన్లు..

ఈ నాయిస్ కలర్ ఫిట్ మైటీ స్మార్ట్ వాచ్ యాపిల్ డిజైన్ లో ఆకట్టుకుంటోంది. యాపిల్ వాచ్ లో ఉన్నట్లు కుడివైపు రోటేటింగ్ క్రౌన్ ఉంది. దీనిని 360 డిగ్రీలు రొటేట్ చేసుకునేలా అవకాశం కల్పించారు. 1.96 ఇంచుల టీఎఫ్‍టీ డిస్‍ప్లేను నాయిస్ కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 500 నిట్స్ వరకు బ్రైట్‍నెస్ ఉంటుంది. స్లీక్, మోటాలిక్ బాడీతో ప్రీమియమ్ లుక్‍ను ఈ వాచ్ కలిగి ఉంది. 100కు పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి.

పీచర్లు..

బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో నాయిస్ కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ వచ్చింది. బ్లూటూత్ 5.3 వెర్షన్‍ను కలిగి ఉంది. బ్లూటూత్ ద్వారా ఫోన్‍కు పెయిర్ చేసుకొని వాచ్‍ ద్వారా కాల్స్ మాట్లాడవచ్చు. వాచ్‍లోనే నోటిఫికేషన్లను పొందవచ్చు. ఫోన్‍లో నాయిస్‍ఫిట్ యాప్‍కు ఈ వాచ్‍ను సింక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్లు, వాతావరణ సమాచారం, కెమెరా, మ్యూజిక్ కంట్రోల్, రిస్ట్ వేకప్ వంటి వాటిని దీనిని నుంచి ఆపరేట్ చేయొచ్చు. 110కు పైగా స్పోర్ట్స్ మోడ్‍లకు నాయిస్ కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. హృదయ స్పందనలను కొలిచే హార్ట్ రేట్ మానిటరింగ్‍తో పాటు ఎస్‍పీఓ 2, స్లీప్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లతో ఈ వాచ్ వచ్చింది.

ఇవి కూడా చదవండి

బ్యాటరీ పనితీరు..

దీనిలో 300ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 7 రోజుల వరకు లైఫ్ ఇస్తుందని నాయిస్ తెలిపింది. వాటర్, డస్ట్ నుంచి రక్షణ కోసం ఐపీ67 రేటింగ్‍ను ఈ వాచ్ కలిగి ఉంది.

ధర, లభ్యత..

నాయిస్ కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ ధర రూ.1,999గా ఉంది. నాయిస్ అధికారిక వెబ్‍సైట్ లో ఇప్పటికే ఈ వాచ్ సేల్‍కు వచ్చింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ లోనూ అందుబాటులో ఉంది. జెట్ బ్లాక్, కామ్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, బర్గండీ వైన్, సిల్వర్ గ్రే కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ అందుబాటులో ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్