Business Idea: మీ నైపుణ్యమే పెట్టుబడి.. నెలకు రూ. 30,000 ఆదాయం పక్కా.. సింపుల్ బిజినెస్ ఐడియా..

ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ సర్వీస్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది. సరిగ్గా ఇదే ఇప్పుడు ట్రెండీ బిజినెస్ గా మారుతోంది. అవునండీ.. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ రిపోర్టు, సర్వీసింగ్ కు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. దీనిలో నైపుణ్యం సంపాదించుకొని, సరైన మార్కెటింగ్ స్ట్రాటజీతో వెళ్తే బిజినెస్ విజయవంతం కావడం పక్కా.

Business Idea: మీ నైపుణ్యమే పెట్టుబడి.. నెలకు రూ. 30,000 ఆదాయం పక్కా.. సింపుల్ బిజినెస్ ఐడియా..
Business Idea
Follow us

|

Updated on: May 03, 2023 | 4:00 PM

ఇటీవల కాలంలో టెక్నాలజీని అందరూ ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ లను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు ల్యాప్ టాప్ అంటే ఎవరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులో.. పీజీ, పీహెచ్ డీ విద్యార్థులో వినియోగించే వారు. కానీ మారుతున్న కాలానుగుణంగా స్మార్ట్ ఫోన్ లాగే ల్యాప్ టాప్ కూడా ఇంట్లో అనివార్యంగా ఉండాల్సిన వస్తువే అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ చేతిలో లేనిదే అడుగు వేయలేని పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉంది. ఈ నేపథ్యంలో ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ సర్వీస్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది. సరిగ్గా ఇదే ఇప్పుడు ట్రెండీ బిజినెస్ గా మారుతోంది. అవునండీ.. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ రిపేరు, సర్వీసింగ్ కు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. దీనిలో నైపుణ్యం సంపాదించుకొని, సరైన మార్కెటింగ్ స్ట్రాటజీతో వెళ్తే బిజినెస్ విజయవంతం కావడం పక్కా. ప్రతి రోజూ కచ్చితమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ల్యాప్ టాప్, స్మార్ట్ వినియోగదారులకు మీ సర్వీస్, మీ పనితీరు, మీ మాటతీరు నచ్చితే మౌత్ టాక్ ద్వారా మీ బిజినెస్ ను అమాంతం పెంచేస్తారు. అప్పుడు మీ బిజినెస్ లాభాల బాట పడుతుంది. ఆ నేపథ్యంలో అసలు ఈ ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ సర్వీస్ సెంటర్ ను ఎలా ప్రారంభించాలి? ఎంత పెట్టుబడి అవసరం? రాబడి ఎలా ఉంటుంది? వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నైపుణ్యం ప్రధానం..

ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ల సర్వీస్ సెంటర్ ప్రారంభించాలంటే మొదటగా మీరు దానిలో నైపుణ్యం సాధించాలి. ప్రాథమికంగా అసలు ల్యాప్ టాప్ ఉండే విడి భాగాలు, ఫోన్లలో ఉండే భాగాలపై కనీస అవగాహనకు రావాలి. ఆ తర్వాత తప్పనిసరిగా ఏదైన మంచి సంస్థ చేరి ట్రైనింగ్ తీసుకోవాలి. చాలా సంస్థలు మొబైల్ రిపేర్, ల్యాప్ టాప్ రిపేర్ కోర్సులను అందిస్తున్నాయి. వాటిల్లో బెస్ట్ సంస్థను ఎంపిక చేసుకొని కోర్సు పూర్తి చేసి నైపుణ్యం సంపాదించుకోవాలి. కొన్ని సంస్థలు ఆన్ లైన్ లో కూడా ల్యాప్ టాప్, మొబైల్ రిపేరింగ్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ కోర్సుకు సంబంధించి ఆన్ లైన్ కన్నా, ఆఫ్ లైన్ లో ఇన్ స్టిట్యూట్ కి వెళ్లి నేర్చుకోవడం ఉత్తమం. ఇది అంతా ప్రాక్టికల్ గా చేసేదే కాబట్టి ఆన్ లైన్ అంత ప్రిఫరబుల్ కాదు.

వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి..

మీరు ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ రిపేరింగ్ లో మంచి నైపుణ్యం సాధిస్తే అప్పుడు మీరు ప్రత్యేకంగా ఓ షాపు ప్రారంభించవచ్చు. అయితే ఆ షాపునకు వినియోగదారులు ఈజీగా రాగలిగేలా ఉండాలి. ప్రయాణ సాధనాలు అందుబాటులో ఉండాలి. సులభంగా గుర్తించగలిగే సెంటర్ లో షాపు పెట్టాలి. అలాగే ఎక్కువగా రిపేర్ సెంటర్లు లేని ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మీ బిజినెస్ ను సోషల్ మీడియాలో ప్రోమోట్ చేసుకోవాలి. ప్రత్యేకమైన పేజీ క్రియేట్ చేసుకొని, ఆసక్తికర అప్ డేట్లు పోస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ షాపు పేరు వినియోగదారులకు నోటెడ్ అయిపోతుంది.

ఇవి కూడా చదవండి

చాలా తక్కువ పెట్టుబడి చాలు..

చాలా తక్కువ పెట్టుబడితో ఈ ల్యాప్ టాప్, మొబైల్ రిపేర్ సెంటర్ ను ప్రారంభించవచ్చు. కేవలం రూ. 30,000 నుంచి రూ. 50,000 వరకూ పెట్టుబడితో దీనిని ప్రారంభించవచ్చు. పెద్ద ఎత్తున సామగ్రి కొనకుండా.. అవసరం మేరకు వస్తువులను కొనుగోలు చేసి బిజినెస్ ప్రారంభించవచ్చు. మథర్ బోర్డు, ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డ్రైవ్, సౌండ్ కార్డ్ వంటివి ఎక్కువ మొత్తంలో తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి ఆర్డర్ చేస్తే సులభంగా మనకు వచ్చేస్తాయి.

కనీసం నెలకు రూ. 30,000 ఆదాయం పక్కా..

అంచనా ప్రకారం ఈ బిజినెస్ ప్రారంభించిన కొత్తలో రోజుకు వందల్లో సంపాదించవచ్చు. ఎందుకంటే ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ సర్వీస్ చార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వినియోగదారులకు మీ సర్వీస్ నచ్చి, నమ్మకం ఏర్పడితే బిజినెస్ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు కనీసం నెలకు రూ. 30,000 పైగానే సంపాదించే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles