AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Gaming laptops: గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లపై అదిరే ఆఫర్లు.. ఏకంగా 50శాతం వరకూ తగ్గింపు..

ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాటఫారం అమెజాన్‌ మరో సేల్‌ ప్రారంభించింది. అతి తక్కువ ధరలోనే అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌, హై పెర్ఫామెన్స్‌ అందించే ల్యాప్‌ టాప్‌లను ఆఫర్లో అందుబాటులో ఉంచింది. ఆయా ల్యాప్ టాప్‌లపై దాదాపు 50శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తోంది.

Best Gaming laptops: గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లపై అదిరే ఆఫర్లు.. ఏకంగా 50శాతం వరకూ తగ్గింపు..
Asus Tuf Gaming A15
Madhu
|

Updated on: May 29, 2023 | 8:30 AM

Share

ఆన్ లైన్ గేమ్స్‌ ఆడటానికి ఇష్టపడతారా? అందుకోసం మంచి గేమింగ్‌ ల్యాప్‌ టాప్‌ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? తక్కువ ధరలో అధిక పనితీరునిచ్చే ల్యాప్‌ టాప్‌ కావాలనుకొంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాటఫారం అమెజాన్‌ మరో సేల్‌ ప్రారంభించింది. అతి తక్కువ ధరలోనే అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌, హై పెర్ఫామెన్స్‌ అందించే ల్యాప్‌ టాప్‌లను ఆఫర్లో అందుబాటులో ఉంచింది. ఆయా ల్యాప్ టాప్‌లపై దాదాపు 50శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. వాటిల్లో అసుస్‌, హెచ్‌పీ, హానర్‌, లెనోవా వంటి బ్రాండ్‌ ల్యాప్‌ టాప్‌ లు ఉన్నాయి. అవి కూడా కేవలం రూ. 50,000 ధరలోనే అందుబాటులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..

అసుస్‌ టఫ్‌ గేమింగ్‌ ఏ15..

ఈ ల్యాప్‌టాప్‌పై 31శాతం తగ్గింపును అమెజాన్‌ అందిస్తోంది. ఇది ఏఎండీ రేజన్‌ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. వేగవంతమైన పనితీరు కోసం 6 కోర్‌, 12 థ్రెడ్‌ ఉంటుంది. బ్యాక్‌లిట్ చిక్లెట్ కీబోర్డ్‌తో రూపొందించబడిన ఈ ల్యాప్‌ టాప్‌ తో సులభంగా గేమింగ్‌ చేయొచ్చు. 8జీబీ ర్యామ్‌ కలిగిన ల్యాప్ టాప్ ధర రూ. 49,990గా ఉంది.

హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్‌14..

గేమింగ్‌ ప్రియులకు ఇది అత్యుత్తమ ఎంపిక. అమెజాన్‌ సేల్‌లో దీనిని రూ. 50,000 లోపే పొందొచ్చు. యాంటీ-గ్లేర్ స్క్రీన్ మీ కళ్లను కాపాడుతుంది. ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌ ఉంటుంది. ఒక్క టచ్‌తో లాగిన్‌ అవ్వొచ్చు. బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో చీకటిలో వినియోగించుకోవచ్చు. దీని ధర రూ. 48,990గా ఉంది.

ఇవి కూడా చదవండి

హెచ్‌పీ 15ఎస్‌, రేజన్‌ 5..

ఈ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌పై అమెజాన్‌లో 15శాతం తగ్గింపును పొందొచ్చు. దీనిలోని అలెక్సా ఫీచర్ మీ పనిని సులభతరం చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ డ్యూయల్ స్పీకర్‌లతో వస్తుంది. విండోస్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. దీని ధర రూ. 49,990గా ఉంది.

లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 1..

ఈ లెనోవో ల్యాప్‌టాప్‌ శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లు, స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. స్క్రీన్ పరిమాణం 15.6 అంగుళాలు. ఇది 1920×1080 రిజల్యూషన్‌తో వస్తుంది యాంటీ-గ్లేర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీన్ని వైఫై, బ్లూటూత్ రెండింటితోనూ సులభంగా కనెక్ట్ చేయవచ్చు. ఈ గేమింగ్‌ ల్యాప్‌ టాప్‌ ధర రూ. 40,990గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..