Oil Prices: గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. ఎంత అంటే..?

మన దేశంలో ఏం వండుకోవాలన్నా వంట నూనె వాడకం తప్పనిసరి. అందుకే వంట నూనె ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. ఇటీవల వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా వాటి ధర తగ్గనున్నట్లు తెలిసింది.

Oil Prices: గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. ఎంత అంటే..?

|

Updated on: Jun 07, 2023 | 10:01 PM

మన దేశంలో ఏం వండుకోవాలన్నా వంట నూనె వాడకం తప్పనిసరి. అందుకే వంట నూనె ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. ఇటీవల వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా వాటి ధర తగ్గనున్నట్లు తెలిసింది. నూనెల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం వంట నూనెల తయారీ పరిశ్రమలను కోరింది. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు ఆల్రెడీ తగ్గాయి. అయినా దేశీయ పరిశ్రమలు మాత్రం వంటనూనె ధరలు తగ్గించడంలేదు. దాంతో కేంద్రం పభుత్వం రంగంలోకి దిగింది.ఒక్కో లీటర్‌పై 8 నుంచి 12 రూపాయల వరకూ ధర తగ్గించాలని కేంద్రం కోరింది. జూన్‌ 2న కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా నేతృత్వంలో వంటనూనెల పరిశ్రమ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ధరలు తగ్గించాలని కేంద్రం వారికి సూచించింది. డిస్ట్రిబ్యూటర్లు, రీఫైనర్లకు కూడా వంటనూనెల తయారీ సంస్థలు ధరలు తక్షణమే తగ్గించాలని తెలిపింది. డిస్ట్రిబ్యూటర్లు, రీఫైనర్లకు ధరలు తగ్గించినప్పుడు ఆ ప్రయోజనం వినియోగదారులకు కూడా అందాలని పేర్కొంది. ధరల తగ్గింపు విషయాలను తరచూ తమ దృష్టికి తీసుకురావాలి పరిశ్రమ ప్రతినిధులకు కేంద్రం సూచించింది. కాగా వంటనూనెల ధరలు గత కొంత కాలంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు తగ్గడమే ఇందుకు కారణం. రానున్న రోజుల్లో ఈ ధరలు ఇంకా తగ్గనున్నాయి. దీంతో సామాన్యులకు కాస్త ఊరట లభించనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us